'అంతరిక్షం' షూటింగ్ పూర్తి...
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ 'అంతరిక్షం'. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన 'ఘాజీ'కి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి.. ఈ సైంటిఫిక్ థ్రిల్లర్‌కు కూడా దర్శకత్వం వహించారు.
అదితి రావ్ హైదరి, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి.. దర్శకుడు క్రిష్, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది.
ఈ విషయాన్ని వరుణ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సినిమా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేశానని తెలియజేస్తూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. గ్రాఫిక్స్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదలవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com