నా పెళ్లాన్నే పో అంటావా.. వరుణ్ వర్సెస్ మహేశ్!!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు బిగ్‌బాస్-3 విజయవంతంగా ఐదో ఎపిసోడ్‌ను కూడా పూర్తి చేసుకుంది. నాలుగో రోజు ‘కర్రోడు’ అంటూ రవికృష్ణ-మహేశ్‌ల మధ్య వివాదం చెలరేగిన విషయం విదితమే. అయితే ఐదో రోజు కూడా అదే మహేశ్ వర్సెస్ వరుణ్‌ల మధ్య రచ్చ రచ్చ జరిగింది. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్లో 6 కంటెస్టెంట్స్ ఉండటంతో ఒక్కొక్కరు ఫెర్ఫామెన్స్ ఇరగదీస్తున్నారు.
అసలేం జరిగింది..!
చపాతీ ముక్క కోసం మొదట గొడవ జరగ్గా ఆ తర్వాత మహేష్ విట్ట- వరుణ్ సందేశ్‌ల మధ్య కొట్లాట జరిగింది. వరుణ్ భార్య వితిక షెరును మహేష్ విట్టా.. ‘లోపలికి పో’ అన్నాడని ఫీల్ అయ్యింది. బాగా ఫీలయిన వితిక గట్టిగా అరవడంతో వరుణ్ రంగంలోకి దిగి మహేశ్‌పై కన్నెర్రజేసి రచ్చరచ్చజేశాడు.
వరుణ్ ఏమన్నాడు..!
‘ఏయ్.. నా పెళ్లాన్ని పో అంటావా? సిగ్గులేనోడా?’ అంటూ సహనం కోల్పోయి మహేష్‌ని కొట్టేందుకు మీది మీదికి పోయాడు. అయితే మహేష్ సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వరుణ్ మాత్రం అస్సలు తగ్గలేదు. మీది మీదికి పోవడంతో తిక్కరేగిన మహేశ్ ధీటుగా ఘాటుగా స్పందించాడు. ఈ ఇద్దరూ ‘రారా.. అంటే రారా’ అని కొట్టుకోవడానికి సిద్ధమైపోయారు. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ అడ్డుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఈ క్రమంలో వితికా గట్టిగా అరుస్తూ మహేష్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహేశ్ వర్సెస్ వరుణ్, వితికాల వివాదం జరుగుతుండగానే ఎపిసోడ్ ముగిసింది. అయితే ఐదో ఎపిసోడ్లో మాత్రం ఓవరాక్షన్.. అతి ఫెర్ఫామన్స్తో వరుణ్ హంగామా చేశాడని చెప్పుకోవచ్చు. మరి ఇవాళ్టి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout