7న వరుణ్ నిశ్చితార్థం
Send us your feedback to audioarticles@vaarta.com
హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత కొత్తబంగారులోకం ఆయనకు కెరీర్లో చాలా పెద్ద హిట్. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఏమైంది ఈ వేళ కూడా ఆయన కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమా. ఆ తర్వాత భారీ హిట్లు లేకపోయినప్పటికీ వరుణ్ సందేశ్ అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు.
ఆయన ఆ మధ్య నటించిన సినిమా పడ్డానండీ ప్రేమలో మరి. ఆ సినిమాలో వితిక శేరు నాయిక. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఇరు తరఫు పెద్దలు పెళ్లికి అంగీకరించారు. డిసెంబర్ 7న హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ క్లబ్లో వివాహనిశ్చితార్థ వేడుక జరుగనుంది. వరుణ్ తండ్రి జీడిగుంట విజయసారథి, తల్లి రమణి ఈ విషయాన్ని ఆహ్వాన పత్రికలను పంచి చెప్పి అందరినీ స్వాగతించారు. శివాజీ శేరు, అనంతలక్ష్మి దంపతులకు వితిక తొలి సంతానం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com