వ‌రుణ్ ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Saturday,October 24 2015]

వ‌రుణ్ సందేశ్, వితికా శేరు ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డిన విష‌యం తెలిసిందే..వీరిద్ద‌రు ప‌డ్డానండి ప్రేమ‌లో సినిమాలో న‌టించారు. ఏ ముహుర్తాన ఈ సినిమాలో న‌టించారో కానీ...రీల్ లైఫ్ లోనే కాదు..రియ‌ల్ లైఫ్ లో కూడా ప్రేమ‌లో ప‌డిపోయారు. ఈ విష‌యాన్నిఇటీవ‌ల వ‌రుణ్ సందేశ్ స్వ‌యంగా..ల‌క్ష్మీ మంచుతో చేసిన ఓ ప్రోగ్రామ్ లో క‌న్ ఫ‌ర్మ్ చేసాడు.

వ‌రుణ్ సందేశ్, వితికా శేరుల‌ నిశ్చితార్ధం డిసెంబ‌ర్ 7న హైద‌రాబాద్ లో గ్రాండ్ చేయ‌డానికి పెద్ద‌లు నిర్ణ‌యించార‌ట‌. వ‌చ్చే సంవ‌త్స‌రంలో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంది. ప్ర‌స్తుతం వ‌రుణ్ సందేశ్ మామ మంచు అల్లుడు కంచు సినిమాలో న‌టిస్తున్నారు. స‌రైన స‌క్సెస్ లేక స‌త‌మ‌త‌మౌతున్న‌వ‌రుణ్ సందేశ్ కి పెళ్లి త‌ర్వాత అయినా స‌క్సెస్ వ‌స్తుందేమో..