పుకార్లను ఖండిన టాలీవుడ్ జంట
Send us your feedback to audioarticles@vaarta.com
పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ సందేష్, వితిక శేరు రియల్ లైఫ్‌లో కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టులో ఒకింటివారయ్యారు. అయితే గత రాత్రి వితిక శేరు, వరుణ్ సందేష్ల మధ్య గొడవ జరిగిందని, వితిక ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని వితిక శేరు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చింది. అలాగే వరుణ్ సందేష్ కూడా ఆ వితిక చేసిన ట్వీట్‌ను రీ ట్వీట్ చేసి తమ జంటపై వస్తున్న రూమర్స్‌ను ఖండించాడు.
హ్యాపీడేస్ చిత్రంలో వన్ ఆఫ్ ది లీడ్ హీరోగా నటించిన వరుణ్ సందేష్ తర్వాత కొత్త బంగారులోకం చిత్రంతో మరో సక్సెస్ అందుకున్నాడు. తర్వాత అనుకున్న స్థాయిలో విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు ఈ యంగ్ హీరో. హీరోయిన్ వితిక శేరును ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ ఏ సినిమాలో నటించడం లేదు. షార్ట్ ఫిలింలో నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com