వరుణ్ నెక్స్ట్ మూవీ అదే

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

వ‌రుణ్‌తేజ్ త‌దుప‌రి సినిమా ఫిక్స్ అయింది. ధూపాటి హ‌రిబాబుగా న‌టించి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు వ‌రుణ్ తేజ్‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్ తేజ్ న‌టించిన సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో మెగా ప్రిన్స్ కొత్త ప్రాజెక్ట్ ను ఓకే చేశారు. ఈ సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్ష‌న్‌, ల‌వ్ సినిమా ఇది.

ఇప్ప‌టిదాకా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన తెలుగు సినిమాల‌న్నీ విజ‌యాన్ని చ‌విచూసిన‌వే. వ‌రుణ్ హైట్‌కి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అయితే బావుంటుంద‌ని మ‌లినేని అనుకున్నార‌ట‌. ఇటీవ‌లే వ‌రుణ్‌కి, నాగ‌బాబుకు క‌థ‌ను వినిపించారు. క‌థను వారిద్ద‌రూ ఓకే చేశార‌ని తెలిసింది. క‌థ‌లో కొన్ని మార్పులు, చేర్పుల‌ను ప్ర‌స్తుతం చేస్తున్నారు . ఈ సినిమా షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి మొద‌లు కానుంది. న‌ల్ల‌మ‌లుపు బుజ్జి, ఠాగూర్ మ‌ధు క‌లిసి ఈ సినిమాను నిర్మిస్తారు. ముకుంద‌ను తీసింది కూడా ఠాగూర్ మ‌ధు కావ‌డం విశేషం.

More News

స‌మంత మేన‌మామ మృతి

స‌మంత మేన‌మామ చ‌నిపోయారు. ఆయ‌న ప‌నిచేస్తున్న కార్యాల‌యంలో ఆయ‌న శ‌వ‌మై క‌నిపించారు.

చరణ్, పవన్ మూవీకి డైరెక్టర్ ఫిక్స్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మూవీని నిర్మించనున్న విషయం తెలిసిందే.పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి ప్రస్తుతం స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది.

నిన్న చిరంజీవి..నేడు వినాయక్..

మెగాస్టార్ చిరంజీవి..కంచె సినిమా చూసి టీమ్ ను అభినందించ‌కుండా ఉండ‌లేక‌పోయారు. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ..కంచె సినిమా త‌న‌కు ఎంత‌గా న‌చ్చిందో చెప్పారు.

ర‌జ‌నీ స‌ర‌స‌న ఐశ్వ‌ర్య‌రాయ్..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని యువ ద‌ర్శ‌కుడు రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

క్రిష్ టార్గెట్ ఇదే..

గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్నిఅందుకున్న డైరెక్ట‌ర్ క్రిష్.