సమంతకు బౌన్సర్‌లా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ తారలంటే జనాల్లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ హీరోయిన్లంటే యువత మరింత ఉత్సాహం చూపిస్తారు. అయితే కొందరి వాళ్ల హీరోయిన్లు ఇబ్బంది పడిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అసభ్యంగా తాకడం లేదా తాకేందుకు ప్రయత్నించడం వంటి ఘటనలు ఎన్నో సార్లు టీవీలలో చూశాం. తాజాగా ఇలాంటి వారి బారి నుంచి అగ్ర కథానాయిక సమంతను కాపాడారు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్.
విడాకుల అనంతరం సినిమాల విషయంలో సమంత దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. దక్షిణాదితోపాటు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకూ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. దీని కారణంగానే ఆమె హైదరాబాద్ కంటే ముంబయిలోనే ఎక్కువగా దర్శనమిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్‌లకు సంబంధించి పలువురితో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్ అండ్ డీకేలను సమంత కలిశారు. ‘ఫ్యామిలీమేన్-2’ సిరీస్‌తో తనకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఇచ్చిన వీరిద్దరిని కలిసి మాట్లాడారు. అయితే ఈ భేటీలో సమంతతోపాటు వరుణ్ ధావన్ కూడా పాల్గొన్నారు.
ఈ సమావేశం ముగించుకుని సమంత-వరుణ్ ధావన్ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఫొటోలు తీసుకునేందుకు కేకలు వేస్తూ ఎగబడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వరుణ్ వారి బారి నుంచి సమంతను కాపాడారు. ఆమెను ఎందుకు భయపెడుతున్నారు అంటూ ఓ బౌన్సర్, బాడీగార్డ్ మాదిరిగా ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లి కారు ఎక్కించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments