యూత్, ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా 'వరుడు కావలెను' - దర్శకురాలు లక్ష్మీ సౌజన్య

  • IndiaGlitz, [Monday,October 25 2021]

నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పి.డి.వి.ప్రసాద్‌ సమర్పణలో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య మీడియాతో ఇలా ముచ్చటించారు.

నేను పుట్టింది కర్నూలు జిల్లాలో అయినా పెరిగిందంతా గుంటూరు జిల్లా నరసరావు పేట. మా నాన్న మ్యాథ్స్ లెక్చరర్. 11 ఏళ్లకే పదో తరగతి ఎగ్జామ్ రాశాను. చిన్నప్పటి నుంచి గుంపులో కలిసిపోవడం కాకుండా నలుగురిలో ఒకరిలా ఉండటం ఇష్టం. అందుకే సినిమా ఇండస్ట్రీ నాకు కరెక్ట్ అనిపించింది. ఇంట్లో పెళ్లి చేస్తానంటే వద్దని వారించి, పద్దెనిమిదేళ్ల వయసులో హైదరాబాద్ వచ్చేశాను.

తేజ, శేఖర్ కమ్ముల, కృష్ణవంశీ, ఆర్కా మీడియా, ప్రకాష్ కోవెలమూడి దగ్గర పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా వర్క్ చేశాను. ‘వాంటెడ్’ తర్వాత దర్శకత్వ ప్రయత్నాలు మొదలుపెట్టాను. మొత్తానికి ఇండస్ట్రీలో 15 ఏళ్ల జర్నీ తర్వాత ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. సినిమా మేకింగ్‌లో నా ఇండివిడ్యువాలిటీ నాకుంది.

2017లో చినబాబు గారికి ఈ కథ చెప్పాను. స్టోరీ ఐడియా మొదలు అరగంట ఫుల్ నెరేషన్ వరకూ అంతా ఆయనకి నచ్చింది. అలా ఈ సినిమా మొదలైంది. ప్యాండమిక్ వల్ల రెండేళ్లు ఆలస్యమైంది. హారిక హాసిని క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో నా లాంటి కొత్త డైరెక్టర్ కి అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తున్నాను.

నా చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాల నుంచే కథలు రాసుకుంటాను. రియల్ లైఫ్ లో సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఒక అమ్మాయిని చూసి ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నాను. బేసిగ్గా నాలోనూ ఆ క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మూవీతోనే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యామిలీ సబ్జెక్ట్ ఎంచుకున్నాను .

ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి ప్రేమించాలంటే ఆ అబ్బాయిలో చాలా క్వాలిటీస్ ఉండాలి. అవన్నీ నాగశౌర్యలో ఉన్నాయనిపించింది. ఫస్ట్ నుంచి హీరోగా నాగశౌర్యనే అనుకున్నాను.

మనుషులందరికీ బాడీ పార్ట్స్ ఒకేలా ఉంటాయి. కానీ పోలికల్లోనే చిన్న చిన్న తేడాలుంటాయి. అలాగే సినిమాకి సంబంధించిన స్టోరీస్, రిలేషన్స్, ఎమోషన్స్ అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మనం ఎంచుకున్న క్యారెక్టరైజేషన్, బ్యాక్‌డ్రాప్ వల్ల సీన్స్ కొత్తగా మారతాయి. అవే సినిమాకి కొత్తదనాన్ని తెస్తాయి. ఈ సినిమాలో అలాంటి కొత్తదనం ఉంటుంది.

ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ పేరు భూమి. పేరుకు తగ్గట్టే భూమికి ఉన్న అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఎదుటివాళ్లని ఎంత రెస్పెక్ట్ చేస్తుందో వాళ్ల నుంచి అదే రెస్పెక్ట్ కోరుకుంటుంది. ఒకరిపై ఆధారపడదు. ఎవరినీ ఇబ్బంది పెట్టడు. అందుకే పర్యావరణానికి ఇబ్బంది లేని ఎకో ఫ్రెండ్లీ బిజినెస్ చేస్తుంది. అలాంటి అమ్మాయి ప్రేమించాలంటే తన కంటే ఆ అబ్బాయిలోనే ఎక్కువ క్వాలిటీస్ ఉండాలి.

ఈసినిమాలో హీరో పేరు ఆకాష్ . పేరుకు తగ్గట్టే ఆకాశమంత విశాల హృదయం ఉన్న వ్యక్తి. తను ఓ ఆర్కిటెక్ట్. తన ప్రొఫెషన్ లాగే లైఫ్‌ను కూడా అందంగా డిజైన్ చేసుకుంటాడు.

ఇప్పుడున్న అమ్మాయిలందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. అబ్బాయిలకూ కనెక్ట్ అవుతుంది. ఎలా ఉంటే అమ్మాయిలకు అబ్బాయిలు నచ్చుతారనేది ఈ సినిమా చూసి ఫాలో అవ్వొచ్చు.

మన అందరి జీవితాల్లో ఆల్రెడీ చాలా ట్విస్టులు, ఫజిల్స్ ఉంటాయి. మళ్లీ సినిమాల్లో కూడా ఎందుకు. ప్రకృతి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత ప్లజంట్‌గా ఉంటుంది. కళ్లకు అందంగా, చెవులకు వినసొంపుగా ఉంటూ, థియేటర్‌‌లో ప్రశాంతంగా ఆనందంగా నవ్వుతూ చూసే సినిమా.

నిర్మాత చినబాబు గారు ఈ సినిమాలో ఓ పార్ట్ కాదు.. ఆయన సపోర్టే ఈ సినిమా. నా దృష్టిలో ఈ సినిమాకు ఆయనే హీరో. ఒకసారి మాటిస్తే అది తప్పరు. ఆయనకి సినిమా అంటే ఎంతో ఫ్యాషన్. చాలా ఎథిక్స్ ఉన్న వ్యక్తి. అందుకే ఇలాంటి సినిమా తీశారు. లైఫ్ అంతా ఆయనకు రుణపడి ఉంటాను. ఈ సినిమా విషయంలో నన్నెంతో గైడ్ చేశారు.

ఐడెంటిటీ కోసం మనమంతా చాలా తాపత్రయపడతాం. ఈ ఐడియాతో ఆధార్ కార్డ్ నేపథ్యంలో నెక్స్ట్ మూవీకి కథ రాసుకున్నాను. *డైరెక్షన్ అంటే ఎంతో బాధ్యత గల వృత్తి. మనల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతుంటారు. వాళ్లెవరినీ తప్పుదోవ పట్టించకూడదు. అందుకే నేను ఏ సినిమా చేసినా ప్రేక్షకులను హ్యాపీగా నవ్వించడమో, ఏ మంచి విషయమో నేర్పించడమో ఉండేలా చూసుకుంటాను.

More News

'రామ్ అసుర్' చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ లాంచ్..!!

ఎఎస్‌పి మీడియా హౌస్, జివి ఐడియాస్ ప‌తాకాల‌పై అభిన‌వ్ స‌ర్ధార్‌, రామ్ కార్తిక్, చాందిని త‌మిళ్‌రాస‌న్‌, శాని సాల్మాన్‌‌, శెర్రి అగర్వాల్  నటీనటులుగా వెంక‌టేష్ త్రిప‌ర్ణ దర్శకత్వంలో

రానా దగ్గుబాటి రిలీజ్ చేసిన  ‘హీరో’ ఫస్ట్ సింగిల్ ‘అచ్చ తెలుగందమే’..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా

శ్రీసింహా కోడూరి కొత్త సినిమా 'భాగ్ సాలే' షూటింగ్ ప్రారంభం

సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “భాగ్ సాలే”.

బిడ్డింగ్ నేప‌థ్యంపై డిజిట‌ల్ మాధ్య‌మంలో మొట్టమొదటిసారి రూపొందిన ‘ఆహా’ స‌రికొత్త గేమ్ షో ‘స‌ర్కార్‌’

తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో మ‌రో స‌రికొత్త గేమ్ షో ‘స‌ర్కార్‌’(మీ పాటే నా ఆట‌) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

'జై భజరంగి' చిత్రం థియేటర్లలో మాత్రమే చూడాల్సిన చిత్రం : నిర్మాత నిరంజన్ పన్సారి

'బాహుబలి',  ‘కె.జి.యఫ్’ సినిమా స్థాయిలో వస్తున్న మరో అద్భుత భారీ చిత్రం 'జై భజరంగి 2'.