25న వస్తున్న 'చంద్రిక'

  • IndiaGlitz, [Monday,September 21 2015]

ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై.. యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ చంద్రిక'. కార్తీక్‌ జయరామ్‌-కామ్న జెత్మలాని-శ్రీముఖి హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది.

నిర్మాత వి.ఆశ మాట్లాడుతూ... మా దర్శకుడు యోగేష్‌ చంద్రిక' చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్‌ప్లే, అర్టిస్టుల అభినయం, మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ గున్వంత్‌సేన్‌ రీరికార్డింగ్‌తోపాటు గ్రాఫిక్స్‌ చంద్రిక' చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈనె 25న విడుదల చేస్తున్నాం' అన్నారు.

చిత్ర దర్శకుడు యోగేష్‌ మాట్లాడుతూ... మా నిర్మాత ఆశ మేడమ్‌ మరియు ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణలందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్ల అద్భుతంగా రూపొందిన చంద్రిక' అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొంటుందనే నమ్మకం ఉంది' అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌!!