సాయిథ‌ర‌మ్ తేజ్ న్యూమూవీకి వెరైటీ టైటిల్..

  • IndiaGlitz, [Monday,September 21 2015]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిథ‌ర‌మ్ తేజ న‌టించిన తాజా చిత్రం సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్. ఈ చిత్రాన్ని హారీష్ శంక‌ర్ తెర‌కెక్కించారు. దిల్ రాజు నిర్మించారు. ఈ నెల 24న సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విజ‌యం పై చిత్ర‌యూనిట్ చాలా న‌మ్మ‌కంతో ఉన్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే....సాయిథ‌ర‌మ్ తేజ్ మ‌రోసారి దిల్ రాజు బ్యాన‌ర్ లో సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాకి రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ వేగేశ్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. గ‌తంలో వేగేశ్న స‌తీష్ అల్ల‌రి న‌రేష్ తో దొంగ‌ల బండి సినిమాని తెర‌కెక్కించారు. ఆత‌ర్వాత డైరెక్ట‌ర్ హారీష్ శంక‌ర్ సినిమాల‌కు రైట‌ర్ గా వ‌ర్క్ చేసారు. సాయిథ‌ర‌మ్ తేజ్ తో వేగేశ్న స‌తీష్ తెర‌కెక్కించే సినిమాకి వెరైటీగా శ‌త‌మానం భ‌వ‌తి అనే టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేసారు. మ‌రి...మాస్ ఇమేజ్ ఉన్న సాయిథ‌ర‌మ్ తేజ్ శ‌త‌మానం భ‌వ‌తి అనే క్లాస్ టైటిల్ తో ఎలా ఆక‌ట్టుకుంటాడో.. చూడాలి.