విజయనగరంలో వింత ఫ్యామిలీ.. జగన్ ఛాన్సిస్తే..!?
- IndiaGlitz, [Tuesday,February 04 2020]
మనం ఇంట్లో కటుంబ సభ్యులతో.. బయట ఫ్రెండ్స్‌తో గొడవపడుతుంటాం.. మళ్లీ కొన్ని నిమిషాలకో లేదా గంటకో యథావిధిగా మాట్లాడేస్తుంటాం.. అదేకాస్త మన దూరపు బంధువులో.. ఇంకొకరో అయితే మాట్లాడటం అయితే పక్కాగానీ.. కాస్త లేటవచ్చేమో. కొందరైతే ఏళ్ల తరబడి మాటలుండవ్.. మాట్లాడుకోవడాలుండవ్..!. అదెలాగంటారా..? ఇదిగో ఫొటోలో చూస్తున్నారుగా.. ఈ ఫ్యామిలీ లెక్క. ఒకట్రెండు రోజులు కాదు.. ఒకట్రేండేళ్లు కూడా కాదు.. ఏకంగా కొన్నేళ్లపాటు ఎవరితోనూ మాట్లాడకుండా.. పోనీ ఏదైనా కారణం ఉందా అంటే అది కూడా లేదు. అదీ పరిస్థితి..? ఈ వింత.. చదువుతూనే నవ్వొచ్చే ఈ ఘటన జరిగింది మరెక్కడా కాదండోయ్.. మన ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో.. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, వార్త చదివిన జనాలు నవ్వేసుకుంటున్నారు..? ఇంతకీ అసలు కథేంటి..? వాళ్లకు ఏం జరిగింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సడన్‌గా ఏమైందో..!?
ఈసపు ఈశ్వరరావు అనే వ్యక్తి... తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ.. ఎలాంటి గొడవలు లేకుండా.. ఇరుగుపొరుగు వారితో కూడా మంచిగా మెలుగుతూనే జీవిస్తుండగా సడన్‌గా ఏమైందో ఏమోగానీ.. తల్లిదండ్రులు పిల్లలతో.. పిల్లలు తల్లిదండ్రులతో తప్ప మిగిలిన వారితో ఎవ్వరూ మాట్లాడుకోవట్లేదు. కనీసం ఎదుటివాళ్లు పలకరించినా పలకట్లేదు.. ఉలకట్లేదు. అంతేకాదండోయ్.. వీళ్లు ఎవరింటికీ పోరు.. ఎవర్నీ ఇంటికి రానివ్వరు.. ఇలా నాలుగేళ్లుగా జీవనం సాగించేస్తున్నారు. అయితే సడన్‌గా ఎందుకిలా జరిగిందనేది మాత్రం ఇంతవరకూ తెలియరాలేదు. స్థానికులు మాత్రం రకరకాల కారణాలు చెబుతున్నారు.
నో స్కూల్స్.. నో చదువులు!
ఇవన్నీ అటుంచితే ఇద్దరు పిల్లలను స్కూల్‌కు పంపట్లేదు. ఎంత సేపు ఇంటి లోపలే. ఈ నలుగురే ఏమున్నా.. బయటోళ్లు వచ్చేది లేదు.. వీళ్లు బయటికెళ్లేది లేదు. స్కూల్‌కు వెళ్తాం అని ఆ పిల్లలు నెత్తినోరు మొత్తుకున్నా నో రెస్పాన్స్.. అంతేకాదు.. అధికారులు విషయం తెలుసుకుని కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వీరిలో మాత్రం మార్పులేదు. ఇలా వింతగా ప్రవర్తిస్తుండటంతో ఏమైంద్రా బాబూ అంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు నవ్వేసి ఊరుకుంటున్నారు.
జగన్ ఛాన్సిస్తే..!
‘వైఎస్ జగన్ నాకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. ఆయన పదవిస్తానంటే నేను బయటికొస్తాను లేకుంటే రాను’ అని ఆయన దగ్గరికెళ్లిన మీడియాతో చెబుతున్నారు. మరోవైపు.. జగన్ నాకు ఛాన్సిస్తే.. ఈ జిల్లా పాలన అంతా చూస్తాను. ఏపీలో విద్యావిధానం బాగా లేదు.. ఫీజులు తగ్గించాలి. అమ్మఒడి వంటి కార్యక్రమాలు కార్పొరేట్ స్కూల్స్‌కి ఎందుకు’ అని సర్కార్‌పైనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. ఇలా చాలా కబుర్లే చెబుతున్నాడు.
ఏమై ఉంటుంది..!?
జిల్లాకు చెందిన అధికారులు.. మరీ ముఖ్యంగా ఎస్పీ రంగంలోకి దిగి వారితో నిశితంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నాడు. అయితే ఆ కుటుంబం మానసిక సమస్యతో బాధపడుతోందని ఆయన చెబుతున్నారు. ఆ సమస్య ఏదో తెలుకుని పరిష్కరిస్తామని.. అవసరమైతే ఆస్పత్రికి తరలించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని.. పిల్లలను బడికి పంపే చర్యలు తీసుకంటామని మీడియాకు వెల్లడించారు. సో.. మానసిక సమస్య.. జరగరానిదేదో జరిగినప్పుడు మనుషులు ప్రవర్తిస్తారని వైద్యు నిపుణులు చెబుతున్నారు.