రాజ‌కీయాల్లోకి వ‌స్తా - వ‌ర‌ల‌క్ష్మి

  • IndiaGlitz, [Wednesday,October 31 2018]

త‌మిళంలో 22 సినిమాల్లో న‌టించిన శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌లక్ష్మి 'పందెంకోడి 2', 'స‌ర్కార్' వంటి అనువాద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించారు. కేవ‌లం అనువాద చిత్రాలే క‌దా.. అని తీసి పారేయ‌కుండా, తెలుగులో త‌నే స్వంతంగా డ‌బ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ''డిఫ‌రెంట్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తాను. ఎందుక‌నో తెలుగు సినిమాల‌పై ముందు నుండి ఫోక‌స్ పెట్ట‌లేదు.

త‌మిళం త‌ర్వాత మ‌ల‌యాళం, క‌న్న‌డ చిత్రాలు చేసుకుంటూ వెళ్లిపోయాను. ఇక‌పై తెలుగు సినిమాల్లో కూడా న‌టిస్తాను. తెలుగులో న‌న్ను ఎగ్జ‌యిట్ చేసే సినిమాలు రావ‌డం లేదు. వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాను'' అన్నారు. మ‌రో ప‌దిహేళ్ల త‌ర్వాత మీరు ఎలా ఉంటార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు త‌ప్ప‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌స్తాను. ఏ పార్టీలోకి వ‌స్తాన‌నేది ఇప్పుడే చెప్ప‌లేను' అన్నారు.