విశాల్‌పై వర్మలక్ష్మి ఘాటు వ్యాఖ్యలు
- IndiaGlitz, [Friday,June 14 2019]
హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌పై వరలక్ష్మి శరత్‌కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అందుకు తన సోషల్ మీడియా అకౌంట్‌ను వేదికగా చేసుకున్నారామె. మరి స్నేహితుడు విశాల్‌ను వరలక్ష్మి టార్గెట్ చేయడం వెనుక కారణమేంటి? అనే సందేహాలు తలెత్తక మానవు.
వివరాల్లోకెళ్తే.. ఈ నెల 23న జరగబోయే నడిగర్ సంఘం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాజీ నడిగర్ సంఘం అధ్యక్షుడు, హీరో శరత్‌కుమార్‌పై విశాల్ ఆరోపణలు చేశారు. తండ్రిపై ఆరోపణలు చేసిన విశాల్‌పై వరలక్ష్మి బాగా ఫైర్ అయ్యింది.
'నువ్వు ఇలా దిగజారుతావని అనుకోలేదు. నువ్వు పెరిగిన వాతావరణమే అందుకు కారణమేమో. నువ్వు నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఏం పనులు చేశావో దాన్ని చెప్పుకో.. అంతే కానీ.. నా తండ్రిని అనవసరంగా గొడవల్లోకి ఎందుకు లాగుతావు? ఒకవేళ నిజంగా నా తండ్రి తప్పు చేసుంటే చట్టం ఆయనకి శిక్ష వేస్తుంది. స్నేహితురాలిగా నీకెంతో మద్దతుని ఇచ్చాను. ఇప్పటి నుండి ఇవ్వను. నా ఓటుని పొగొట్టుకున్నావు అంటూ వరలక్ష్మి తెలిపారు.