విశాల్ తో వరలక్ష్మి...

  • IndiaGlitz, [Tuesday,May 30 2017]

తెలుగువాడైన త‌మిళ హీరో విశాల్‌కు, శ‌ర‌త్‌కుమార్ త‌న‌య వ‌ర‌ల‌క్ష్మికి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని, లేద‌ని వార్త‌లు విన‌ప‌డుతూనే ఉన్నాయి. విశాల్‌కు, శ‌ర‌త్‌కుమార్‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. ఈ త‌రుణంలో విశాల్ హీరోగా రూపొందుతోన్న పందెంకోడి2 చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మి కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది.

2005లో విడుద‌లై సూప‌ర్‌హిట్ అయిన పందెంకోడి చిత్రానికి ఇది సీక్వెల్‌. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా వ‌ర‌ల‌క్ష్మి న‌టిస్తున్న పాత్ర నెగ‌టివ్ షేడ్స్‌తో ఉంటుంద‌ని త‌మిళ సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ద‌ర్శ‌కుడు లింగుస్వామి ఈ స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాడు. సినిమా జూలై నుండి సెట్స్‌లోకి వెళుతుంద‌ని స‌మాచారం.