Varalakshmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో 'శబరి' కొడైకెనాల్ షెడ్యూల్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శబరి'. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందుతోంది. తాజాగా కొడైకెనాల్‌లో రెండు వారాల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ ''ఈ రోజు అనిల్ గారి దర్శకత్వం, మహేంద్ర గారి నిర్మాణంలో చేస్తున్న 'శబరి' కొడైకెనాల్ షెడ్యూల్ లాస్ట్ డే. మహేంద్రనాథ్ గారి లాంటి నిర్మాత లభించడం చాలా అదృష్టం. నేను పని చేసిన నిర్మాతల్లో ఆయనొక మంచి నిర్మాత. కొడైకెనాల్, విశాఖ, హైదరాబాద్... చాలా లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నాం.సినిమా బాగా వస్తోంది. 'శబరి'లో నటిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మైమ్ గోపి గారితో నాకు నాలుగో చిత్రమిది. గణేష్ వెంకట్రామన్ కూడా సినిమాలో ఉన్నారు. చిన్నపాప నువేక్షా నా కుమార్తె పాత్రలో నటించింది. ఆ చిన్నారి నాకు బాగా క్లోజ్ అయ్యింది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి, మీ ముందుకు సినిమా ఎప్పుడు తీసుకు వద్దామా? అని ఎదురు చూస్తున్నాను'' అని చెప్పారు.
చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ " కొడైకెనాల్ షెడ్యూల్‌లో వరలక్ష్మీ శరత్ కుమార్‌తో పాటు ముఖ్య తారాగణం పాల్గొన్నారు. అక్కడ 14 రోజులు షూటింగ్ చేశాం. ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఒక పాట, క్లైమాక్స్ షూట్ చేశాం. ఫైట్ మాస్టర్స్ నందు - నూర్ నేతృత్వంలో యాక్షన్ ఎపిసోడ్స్ తీశాం. పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీ చేశారు. త్వరలో విశాఖ షెడ్యూల్ ప్రారంభిస్తాం. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి కొత్త పాత్ర 'శబరి'లో చేస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నాం. సినిమాలో అన్ని సాంగ్స్ రికార్డ్ చేశాం. చిత్ర గారు, అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా, అమ్రితా సురేష్ పాటలను ఆలపించారు" అని చెప్పారు.
దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ " కూతుర్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలకు తెగించే తల్లి పాత్రను వరలక్ష్మీ శరత్ కుమార్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ లేడీగా కనిపిస్తారు. స్వతంత్ర భావాలున్న ఆధునిక యువతిగా, కూతురి క్షేమం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి, కంటికి కనిపించని చీకటి మృగంతో ఒంటరి సైన్యంలాపోరాడే జననిగా, మునుపెన్నడూ చేయనటువంటి భావోద్వేగాలున్న పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతంగా పోషించారు. క్రైమ్ నేపథ్యంలో ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది" అని అన్నారు.
నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments