‘‘హను మాన్’’ నుంచి వరలక్ష్మీ ఫస్ట్‌లుక్.. మరోసారి జయమ్మ ఉగ్రరూపం
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌తో కల్కి అనే సినిమా చేశాడు ప్రశాంత్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. తాజాగా మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘‘ హను-మాన్ ’’ అనే సినిమా చేస్తున్నాడు.
సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ హనుమంతు అనే పాత్రలో నటిస్తున్నాడు. అతని సరసన అమృతా అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.
తాజాగా ఈ మూవీని నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రేపు ఆమె పుట్టిన రోజు పురస్కరించుకుని బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె ‘అంజమ్మ’ అనే పవర్ఫుల్ రోల్లో నటించింది. ఎర్రటి పట్టుచీరలో పెళ్లి కూతురిలా తయారైన వరలక్ష్మీ... కొబ్బరికాయల గెలతో రౌడీలను చితకబాదుతున్నట్టుగా పోస్టర్లో వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com