‘‘హను మాన్’’ నుంచి వరలక్ష్మీ ఫస్ట్‌లుక్.. మరోసారి జయమ్మ ఉగ్రరూపం

  • IndiaGlitz, [Friday,March 04 2022]

తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో సినిమాలు తెరకెక్కించి పేరు తెచ్చుకున్న దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన అ అనే సినిమాతో ప్రశాంత్ వర్మ తన ప్రతిభను చాటుకున్నాడు. తెలుగు తెరపై గతంలో ఎన్నడూ చూడని విభిన్నమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఆ తర్వాత యాంగ్రీ యంగ్‌మెన్ రాజశేఖర్‌తో కల్కి అనే సినిమా చేశాడు ప్రశాంత్. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది. ఆ తర్వాత మరో సరికొత్త జోనర్‌లో జాంబీరెడ్డి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. తాజాగా మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే ‘‘ హను-మాన్ ’’ అనే సినిమా చేస్తున్నాడు.

సోషియో ఫాంటసీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ హనుమంతు అనే పాత్రలో నటిస్తున్నాడు. అతని సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. వెంకట్ కుమార్ జెట్టీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ చేయనున్నారు.

తాజాగా ఈ మూవీని నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రేపు ఆమె పుట్టిన రోజు పురస్కరించుకుని బర్త్ డే విషెస్ తెలుపుతూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె ‘అంజమ్మ’ అనే పవర్‌ఫుల్‌ రోల్‌లో నటించింది. ఎర్రటి పట్టుచీరలో పెళ్లి కూతురిలా తయారైన వరలక్ష్మీ... కొబ్బరికాయల గెలతో రౌడీలను చితకబాదుతున్నట్టుగా పోస్టర్‌లో వుంది.

More News

హీరోయిన్ కాకుండా వుంటే.. కోహ్లీలా వుండేదేమో: సమంతపై జిమ్ ట్రైనర్ ప్రశంసలు

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల స్టార్‌డమ్, కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మంచి అవకాశాలొచ్చి, ఆ సినిమాలు హిట్టయితే ఐదేళ్లు,

అందుకే మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలనుకున్నా : నిందితుడు రాఘవేంద్రరాజు

తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

అసెంబ్లీకి ఆ అధికారం లేదు.. ఏ కార్యాలయాన్ని తరలించొద్దు: అమరావతిపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ మూడు రాజధానులు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) రద్దు పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది.

యుద్ధాన్ని ఆపాలని నేను పుతిన్‌ను ఆదేశించగలనా : సీజేఐ జస్టిస్ ఎన్. వీ. రమణ

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

'డై హార్డ్ ఫ్యాన్' నుంచి హీరో శివ ఆలపాటి లుక్ కు విశేష స్పందన..

శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్ M దర్శకత్వంలో శివ ఆలపాటి మరియు ప్రియాంక శర్మ కీలక పాత్రలలో