Sabari : వరలక్ష్మీ శరత్ కుమార్‌ 'శబరి' విశాఖ షెడ్యూల్ పూర్తి

  • IndiaGlitz, [Friday,November 04 2022]

టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శబరి'. తాజాగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. విశాఖలోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్ చేశాం. అక్కడ ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్ సీక్వెన్సులు, ఒక పాట, కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

నందు, నూర్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందిన ఈ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని చిత్ర బృందం తెలిపింది. నాలుగో షెడ్యూల్ ఈ నెలలో హైదరబాద్‌లో మొదలు కానుంది. దాంతో సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది. నవంబర్ చివరి వారంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు కానున్నాయి.

ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ... వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఎంపిక చేసుకునే చిత్రాలు భిన్నంగా ఉంటాయి. మా 'శబరి' కూడా అటువంటి భిన్నమైన చిత్రమే. శబరి పాత్రను నిజ జీవితంలో కూడా ధైర్యంగా ఉండే వ్యక్తి చేస్తే బాగుంటుందని అనుకుంటున్న తరుణంలో వరలక్ష్మి గారు ఈ కథ వినటం, సినిమా చేయడానికి ఒప్పుకోవడం మా అదృష్టం. ఈ చిత్రంలో స్వతంత్ర భావాలున్న యువతిగా ఆమె కనిపిస్తారు. యాక్షన్ ఎపిసోడ్స్ లో చాలా ఎఫెక్టివ్ గా పెర్ఫార్మ్ చేశారు. అన్ని హంగులున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకు వద్దామా అని ఎదురు చూస్తున్నాం'' అని అన్నారు.

నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, మధునందన్, రషిక బాలి (Bombay), వైవా రాఘవ, ప్రభు, భద్రం, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, ప్రమోదిని బేబీ నివేక్ష, బేబీ కృతిక తదితరులు ఈ చిత్రంలో తారాగణం.

More News

Gaalodu: 'గాలోడు' ట్రైల‌ర్‌ విడుద‌ల‌

సుడిగాలి సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్‌యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`.

BiggBoss: రేవంత్ బూతు పురాణం... ఆదిరెడ్డికి మస్కా కొట్టిన గీతూ, సూర్య జ్ఞాపకాలతో ఇనయా

బిగ్‌బాస్ 6 తెలుగులో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ యమ జోరుగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అంతా పులుల్లా రెచ్చిపోతున్నారు.

Posani Krishna Murali : విధేయతకు అందలం.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్‌గా పోసాని కృష్ణమురళి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

pawan kalyan : ఇల్లు, కార్యాలయం.. నీడలా వెంటాడుతున్న ఆగంతకులు, పవన్ హత్యకు కుట్ర ..?

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్‌కు ఎవరైనా ముప్పు తలపెట్టే అవకాశాలు వున్నాయా అంటూ అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BiggBoss: బిగ్‌బాస్‌లో ‘‘బెడ్ రూమ్’’ కామెంట్స్...ఇనయాపై శ్రీహాన్- శ్రీసత్య ఫైర్, ఆదికి సీక్రెట్ టాస్క్

బిగ్‌బాస్‌లో ఇంట్రెస్టింగ్ టాస్క్‌లతో ఆడియన్స్‌కి అసలు సిసలు మజాను పంచుతున్నారు నిర్వాహకులు.