‘చేజింగ్’లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వరలక్ష్మి శరత్‌కుమార్

  • IndiaGlitz, [Tuesday,December 08 2020]

వెరైటీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. లాక్‌డౌన్ తరువాత ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘చేజింగ్’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ ముప్పుమలాకా దీవిలో జరుగుతోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఒకే సమయంలో రూపొందుతోంది. కాగా.. తాజాగా ఈ షూటింగ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.

ఈ చిత్రం ఫైటింగ్‌ దృశ్యాలను మలాకా దీవీలో ఇటీవల చిత్రీకరించారు. ఓ పడవలో వరలక్ష్మి, బాలశరవణన్‌, యుమున కలిసి సముద్రంలో మరో పడవలో వెళ్తున్న విలన్‌ను వెంటాడే దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా వరలక్ష్మి ప్రయాణిస్తున్న పడవ హఠాత్తుగా బోల్తాపడింది. వెంటనే కొంతమంది నావికులు సముద్రంలోకి దూకి వరలక్ష్మి సహా ముగ్గురినీ కాపాడారు. ఈ చిత్రం గురించి దర్శకుడు కే వీర కుమార్‌ మాట్లాడుతూ హీరోయిన్‌ వరలక్ష్మి డూప్‌ లేకుండా ఫైటింగ్‌ దృశ్యాల్లో నటించిందని తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

More News

రైతు కష్టాలు ఇవాళే కనిపించాయా?: టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై జనం ఫైర్..

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేసినా తప్పే అవుతోంది. వరద బాధితుల పరామర్శకు వెళ్లినప్పుడు ఎక్కడికక్కడ ప్రజానీకం నిలదీసింది.

కేసీఆర్ ప్లాన్.. తెలంగాణలో వైసీపీ.. షర్మిలకు బాధ్యతలు!

రాష్ట్రంలో వరుసగా ఎదురవుతున్న పరాభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తమయ్యారు.

హారిక, అఖిల్‌లపై సొహైల్ ఫైర్..

‘గాజువాక పిల్ల’ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. అరియానా తన లైఫ్ గురించి కెమెరాకు చెబుతోంది. తన ఫస్ట్ శాలరీ 4 వేలు అని చెప్పింది.

నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని కలిసిన సోము వీర్రాజు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సోమవారం సినీ నటుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌ను కలిశారు.

ఏలూరు ఘటన: రిపోర్టులన్నీ నార్మలే.. కానీ ఏం జరుగుతోంది?

ఏలూరులో అంతుచిక్కని వ్యాధి సోకి దాదాపు 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు.