‘చేజింగ్’లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడిన వరలక్ష్మి శరత్‌కుమార్
Send us your feedback to audioarticles@vaarta.com
వెరైటీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. లాక్‌డౌన్ తరువాత ఫుల్ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘చేజింగ్’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ ముప్పుమలాకా దీవిలో జరుగుతోంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా వరలక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషలలో ఒకే సమయంలో రూపొందుతోంది. కాగా.. తాజాగా ఈ షూటింగ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఈ చిత్రం ఫైటింగ్ దృశ్యాలను మలాకా దీవీలో ఇటీవల చిత్రీకరించారు. ఓ పడవలో వరలక్ష్మి, బాలశరవణన్, యుమున కలిసి సముద్రంలో మరో పడవలో వెళ్తున్న విలన్‌ను వెంటాడే దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా వరలక్ష్మి ప్రయాణిస్తున్న పడవ హఠాత్తుగా బోల్తాపడింది. వెంటనే కొంతమంది నావికులు సముద్రంలోకి దూకి వరలక్ష్మి సహా ముగ్గురినీ కాపాడారు. ఈ చిత్రం గురించి దర్శకుడు కే వీర కుమార్ మాట్లాడుతూ హీరోయిన్ వరలక్ష్మి డూప్ లేకుండా ఫైటింగ్ దృశ్యాల్లో నటించిందని తెలిపారు. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com