విలక్షణమైన పాత్రలో వరలక్ష్మి
- IndiaGlitz, [Sunday,July 30 2017]
కేవలం గ్లామర్ సాంగ్లకో, పాత్రలకు పరిమితం కావాలనుకోవడం లేదు వరలక్ష్మి శరత్‌కుమార్. డిఫరెంట్ పాత్రలను చేయడానికి ఆసక్తి చూపుతుంది. అందులో భాగంగా బాల దర్శకత్వంలో వచ్చిన 'తారా తప్పట్టై' చిత్రంలో తమిళనాట ప్రతేక ఆదరణ ఉన్న కరగాట్టం అనే నృత్యాన్ని నేర్చుకుని ప్రదర్శించి అందరి మెప్పు పొందింది. మళ్లీ ఓ హీరోయిన్ సెంట్రిక్ మూవీలో నటించడానికి వరలక్ష్మి సిద్ధమైందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ సినిమాలో వరలక్ష్మి క్యారెక్టర్ ఆమె కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని ఆమె చాలా అతృతగా ఎదురుచూస్తుందట. మరి వరలక్ష్మి ఆశలు పెట్టుకున్న పాత్ర, ఆమెకు ఎలాంటి గుర్తింపునిస్తుందో చూడాలి.