వారాహిచలనచిత్రం చేతిలో సావిత్రి సీడెడ్ హక్కులు
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి చిత్రాలను ఎంకరేజ్ చేస్తూ వాటి విజయంలో కీలకపాత్ర పోషించడంలో వారాహి చలన చిత్రం ఎప్పుడూ ముందుంటుంది. వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న చిత్రాలను చూసి వాటి హక్కులను ఫ్యాన్సీ రేటుకు కైవసం చేసుకుని గ్రాండ్ లెవల్ లో విడుదల చేస్తున్నారు.
గతేడాది సూపర్ హిట్ సాధించినరాజుగారి గది`, జత కలిసే` చిత్రాలను విడుదల చేసిన సాయికొర్రపాటి ఇప్పుడు నారా రోహిత్ నటించిన సావిత్రి సినిమా సీడెడ్ హక్కులను ఫ్యాన్సీ రేటు చెల్లించి సినిమా సీడెడ్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ తో చేజిక్కించుకున్నారు.
యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రాన్ని ప్రేమ ఇష్క్ కాదల్ ఫేమ్ పవన్ సాదినేని దర్శకత్వంలో, విజన్ ఫిలింమేకర్స్ పతాకం పై డా. వి .బి. రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. మార్చి 25న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments