పెళ్లిపై వరలక్ష్మి క్లారిటీ...
- IndiaGlitz, [Monday,October 08 2018]
తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన హీరో విశాల్, హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ మధ్య ప్రేమ.. పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వినపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై తామిద్దరం మంచి స్నేహితులమని విశాల్ క్లారిటీ ఇచ్చినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. విశాల్, వరలక్ష్మికి నిశ్చితార్థం అయిపోయిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై వరలక్ష్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ప్రస్తుతం తను కెరీర్ పైనే దృష్టి పెట్టానని.. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో లేదని ఆమె తెలిపారు. నేను ఇక్కడికి కష్టపడటానికే వచ్చాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది అంటూ వరలక్ష్మి తెలిపారు. విశాల్ 'పందెంకోడి2'లో నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసిన ఈమె.. విజయ్ సర్కార్ చిత్రంలో కూడా కీలక పాత్రలో నటించింది. ఇవి కాక మరికొన్ని చిత్రాల్లో నటిస్తుంది వరలక్ష్మి.