వనితా విజయ్ కుమార్ ఇంటరాగేషన్
- IndiaGlitz, [Thursday,July 04 2019]
మంజుల - విజయ్ కుమార్తె కుమార్తె వనితను ఇటీవల తెలంగాణ పోలీసులు ఇంటరాగేషన్ చేశారు. ఆమె ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నవారిని అసలు ఎవరూ బయటివారిని కలవనివ్వరు. కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో మాత్రం ఇందులో మార్పు వస్తుంది. తెలుగు బిగ్ బాస్‌లో ఉన్నప్పుడే ముమైత్ ఖాన్‌ను డ్రగ్స్ కేసు గురించి విచారించారు. తాజాగా వనితను విచారించింది మాత్రం డ్రగ్స్ గురించి కాదు. ఆమె కూతురు గురించి. వనితకు గతంలో ఆనంద్‌రాజ్‌తో వివాహం జరిగింది. వీరిద్దరూ ఇప్పుడు విడిపోయారు.
అయితే వీరికి జోవిత అని కుమార్తె ఉంది. ప్రస్తుతం జోవిత వనిత మాజీ భర్త ఆనంద్ రాజ్ దగ్గర ఉంటోంది. కానీ ఆమెను వనిత కావాలని కిడ్నాప్ చేసి తన దగ్గరకు తీసుకెళ్లిందని ఆనంద్ రాజ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారట. దాంతో తెలంగాణ పోలీసులు చెన్నై శివార్లలోని ఈవీవీ ఫిల్మ్ సిటీలో ఉన్న బిగ్ బాస్ సెట్‌కు వెళ్లి వనితను విచారించారు. జోవితను కూడా పిలిపించి, ఆమె ఇష్టానుసారమే తల్లి దగ్గరకు వెళ్లిందా? లేకుంటే ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా అని విచారించినట్టు సమాచారం.