ఎన్నాళ్లకెన్నాళ్లకు వంగవీటి రాధా..!? రంగంలోకి దిగినట్టేనా!

  • IndiaGlitz, [Thursday,January 09 2020]

వంగవీటి రాధా.. ఈ వ్యక్తి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. అయితే రాసేటప్పుడే ఒకటికి రెండుసార్లు వార్త ఆలోచించి రాయాల్సి వస్తోంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో..? ఆయనకే తెలియదు. తీరా ఆయన ఏ పార్టీ నుంచి అయితే జంప్ అయ్యారో ఆ పార్టీ అధికారంలోకి రావడం.. మళ్లీ తిరిగిరాలేని పరిస్థితి. ఇది రాధా కథ. అసలు ఈ టైమ్‌లో రాధా వార్తల్లో ఎందుకు నిలిచారు..? కొంపదీసి మళ్లీ పార్టీ మారబోతున్నారా..? ఏంటి..? అనే ఆసక్తికర విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అప్పట్లో సెటైర్ల వర్షం!
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధాకృష్ణ (రాధా) ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో టెన్షన్స్ మధ్య నాటి సీఎం చంద్రబాబు సమక్షంలో ఎట్టకేలకు పసుపు కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే పార్టీ అయితే మారారు కానీ టికెట్ మాత్రం రాలేదు.. దీంతో అప్పట్లో చంద్రబాబు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని టాక్ వచ్చింది. తీరా చూస్తే రాధా స్టార్ క్యాంపెయినర్‌గా మాత్రమే మిగలాల్సి వచ్చింది. చివరికి టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూడటం.. కనివినీ ఎరుగని రీతిలో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని అధికారంలోకి రావడంతో అటు సైకిల్ గుర్తు పార్టీ, ఇటు గ్లాస్ గుర్తు (జనసేన) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిప్పట్నుంచి ఇంతవరకూ వంగవీటి రాధా అడ్రస్ కనిపించలేదు. అప్పట్లో రాధా ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటే బెస్ట్ అని కొందరు.. అబ్బే తీసుకోనక్కర్లేదు ఆల్రెడీ అదే జరిగిందని మరికొందరు వైసీపీ వీరాభిమానులు సెటైర్లేశారు.

అసలేం జరిగింది!?
ఉన్నట్టుండి బుధవారం రాత్రి చంద్రబాబు ఇంటి దగ్గర ప్రత్యక్షమవ్వడంతో అసలేం జరుగుతోంది..? అర్ధరాత్రి ఆయన బాబు ఇంటికి ఎందుకెళ్లారు..? అనే చర్చ మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా రోజుల తర్వాత రాధా ప్రత్యక్షమవ్వడంతో పార్టీ శ్రేణులే ఒకింత కంగుతిన్నారు. మరికొందరైతే అబ్బా ఎన్నాకెన్నాళ్లకు రాధా దర్శనమైంది.. అని చెప్పుకుంటున్నారట. అమరావతిలోనే రాజధాని ఉంచాలని.. తరలించే ప్రసక్తే లేదని గత కొన్నిరోజులుగా రైతులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా, ర్యాలీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నిర్వహించిన జేఏసీ బస్సు యాత్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అనుమతి లేకుండా ఇలా చేయడం శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లేనని చంద్రబాబు సహా జేఏసీ నేతలను అరెస్ట్ చేసి కొద్ది సేపటి తర్వాత మళ్లీ వారివారి ఇంటి దగ్గర వదిలేశారు.

ఎందుకెళ్లినట్లో..!?
ఈ క్రమంలో చంద్రబాబును పరామర్శించడానికి రాధా ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే బాబును కలవలేకపోయారు కానీ లోకేశ్‌పాటు ఇతర నేతలను కలిసి తిరిగొచ్చేశారు. అయితే గత నెల 19 నుంచి అమరావతి వేదికగా రాజధాని విషయంలో ధర్నాలు, ర్యాలీలు జరుగుతున్నప్పటికీ.. కూతవేటు దూరంగా ఆయన ఇల్లు ఉన్నా అస్సలు ఆయన ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోలేదు. ఇప్పుడు మాత్రం చంద్రబాబుకు ఇంటికెళ్లడంతో చాలా రోజుల తర్వాత ఆయనెందుకెళ్లినట్లు..? ఏ పనిమీద వెళ్లారు..? అనేది ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

రంగంలోకి దిగినట్లేనా!?
గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ పార్టీలోనూ రాధా పనిచేసిన ఆయన.. ఎన్నికల తర్వాత టీడీపీకి టాటా చెప్పి జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చంద్రబాబు ఇంటి వద్ద ప్రత్యక్షమవ్వడంతో టీడీలోనే ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. రాధా పూర్తిగా రాజకీయాలను వదిలేశారా..? అనే అనుమానం అభిమానులు, అనుచరుల్లో ఎప్పట్నుంచో ఉంది. అయితే తాజా పరిణామాలతో ఫ్యాన్స్‌లో ఆశలు మళ్లీ చిగురించాయని తెలుస్తోంది. మరీ రాధా పూర్తిగా రంగంలోకి దిగి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తారా లేకుంటే మళ్లీ మామూలైపోతారా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

More News

చిరు సలహా: రంగమ్మత్తకు షాకిచ్చిన రాములమ్మ!

ఇదేంటి.. అసలు ‘రంగస్థలం’లో రంగమ్మత్తగా నటించిన యాంకర్ అనసూయకు.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ షాకివ్వడమా..?

జగన్ రెక్వెస్ట్: మేనమామగా అడుగుతున్నా.. వెయ్యి ఇవ్వండి!

ప్రపంచంతో పోటిపడి పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు.

మహేశ్ బాబుకు వైఎస్ జగన్ సాయం..!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీరాభిమానులకు వైఎస్ జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

'శివ 143' మూవీ సాంగ్ లాంచ్ చేసిన జె.డి.చక్రవర్తి

శైలేష్,ఏఇషా ఆదరహ హీరో హీరోయిన్లు గా భీమవరం టాకీస్ బ్యానర్ లో రామసత్యనారాయణ నిర్మించిన 98 వ చిత్రం “శివ 143″(ది జర్నీ ఆఫ్ టూ హార్స్)

'ఎంత మంచివాడ‌వురా'తో నా కోరిక తీరింది - యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఎంత మంచివాడ‌వురా`. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్‌ వేగేశ్న ద‌ర్శకత్వంలో