ఇంటికొచ్చిన టీడీపీ నేతలకు షాకిచ్చిన వంగవీటి రాధా!?
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా ఏ పార్టీలో చేరాలో తేల్చులేకపోతున్నారు. ఓ వైపు సీఎం చంద్రబాబు ఈ నెల 25న టీడీపీ కండువా కప్పుకుంటారని ఇది వరకే ప్రకటించిన విషయం విధితమే. అయితే ఆయన మాత్రం టీడీపీలోకి వెళ్లడానికి సాహసించట్లేదట. తండ్రి మృతికి కారణమైన తెలుగుదేశం ఎలా చేరతావ్..? అసలేం చేస్తున్నావో అర్థమవుతోందా..? మన ప్రత్యర్థులున్న పార్టీలోకి ఎలా వెళ్తావ్..? అని వంగవీటి కుటుంబానికి చెందిన ఓ కీలక వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని టాక్. దీంతో తన నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బుధవారం సాయంత్రం ఇంటికొచ్చిన టీడీపీ నేతలకు తాను పార్టీలో చేరట్లేదని సడన్ షాకిచ్చారట. దీంతో ఆ షాక్ నుంచి కోలుకునే లోపే జరగాల్సిదంతా జరిగిపోయిందట.
కాగా.. రాధా ముందు నుంచి జనసేనలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించిన దాఖలాల్లేవ్. అంతేకాదు ఇప్పటికే జనసేనానికి రాధాకు మధ్య ఓ కీలకనేత రాయబారం నడిపడంతో స్పష్టమైన టికెట్ హామీ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో టీడీపీ ఆఫర్ను తిరస్కరించి జనసేనలో చేరాలని రాధా సాహసించట్లేదని తెలుస్తోంది. అందుకే తన ఇంటికొచ్చిన చంద్రబాబు మనుషులను మాట్లాడినంత సేపు మాట్లాడి కుదరదని చెప్పేశారట. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక మీటింగ్ నుంచి బయటికొచ్చిన టీడీపీ నేతలు.. చంద్రబాబు చెప్పమన్నవన్నీ రాధా చెప్పాల్సింది చెప్పామని.. గురువారం మీడియా ముందుకు వచ్చి మరింత క్లారిటీ ఇస్తారని చెప్పుకొచ్చారు. రాధా షాకివ్వడంతోనే ఇలా తెలుగు తమ్ముళ్లు బయటికొచ్చి కవర్ చేస్తున్నారని.. లేకపోతే అదిగో.. ఇదిగో.. చేరుతున్నారని నానా హడావుడి చేసేవారు.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ షాకివ్వడంతో మీడియా ముందుకొచ్చే సరికి అసలేం మాట్లాడాలో తెలియని పర్థిస్థితిలో ఏదో నాలుగు మాటలు మాట్లాడి టీడీపీ నేతలు అక్కడ్నుంచి తిన్నగా వెళ్లిపోయారని తెలుస్తోంది.
అయితే గురువారం రోజున రాధా ఏం ప్రకటన చేయబోతున్నారు..? ఇంతకీ ఆయన ఏ పార్టీలోకి చేరాలని ఆసక్తి చూపుతున్నారు..? రాధాకు టీడీపీ ఇచ్చిన హామీలేంటి...?.. రాధాకు ఒక్కరికే టికెట్ హామీ ఇచ్చారా..? ఇంకో సీటు కూడా ఇస్తామని హామీ ఇచ్చారా..? వైసీపీ నుంచి ఎందుకు ఆయన బయటికొచ్చారు..? ఈ ఎన్నికల్లో అసలు ఆయన పోటీ చేస్తారా..? చేయరా..? ఇలాంటి విషయాలపై క్లారిటీ రావాలంటే రాధా మీడియా ముందుకు రావాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout