నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు: వంగవీటి రాధా
Send us your feedback to audioarticles@vaarta.com
"నన్ను చంపేస్తామని కొంతమంది బెదిరిస్తున్నారు" అని వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన ప్రాణం కన్నా ఆశయాలే ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజా జీవితంగా ప్రజా జీవితంలో కొనసాగించాలనుకున్నానని అందుకే రాజీనామా చేశానన్నారు.
నాన్న పేరు చెడగొట్టను..!
"ఎవరైనా నా కిందే అన్నట్లు జగన్ వ్యవహరించారు. నాకు ఓపిక ఉన్నంత వరకు మా నాన్న పేరుని చెడగొట్టను. మా నాన్న విగ్రహావిష్కరణకు ఎన్నో పార్టీల వాళ్లు వస్తారు.. దానికి నన్ను అధిష్టానం ప్రశ్నించడమేంటి..? ఇదేం న్యాయం..? అసలు నా తండ్రి విగ్రహావిష్కరణకు ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలి.. ఎందుకు తీసుకోవాలి? నా తండ్రి అభిమానులు అన్నీ పార్టీల్లో ఉన్నారు" అని ఈ సందర్భంగా రాధా చెప్పుకొచ్చారు.
టీడీపీలో చేరికపై తేల్చని రాధా..!
రాధా రాజీనామా చేసిన మరుక్షణం నుంచే ఆయన.. సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటారని.. ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా ఇచ్చారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల రాధా నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు సుమారు గంటపాటు నిశితంగా పలు విషయాలపై చర్చించి చంద్రబాబు తనతో చెప్పినవన్నీ నిశితంగా వివరించారు. అయితే ఈ చేరిక వ్యవహారంపై తాజా ప్రెస్‌మీట్‌లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తే తనపై దాడులు, ప్రతిదాడులు చేస్తూ.. నానా రకాలుగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ఇన్ని చెప్పిన రాధా తనను చంపుతామని బెదిరిస్తున్నదెవరు.. అని చెప్పడానికి మాత్రం సాహసించలేదు..? దీంతో అసలు రాధాను చంపాలనుకున్నదెవరు..? అసలేం జరుగుతోంది అని అభిమానులు, కార్యకర్తలు ఆలోచనలో పడ్డారు. పోనీ రాధా చెబుతున్నట్లుగా నిజంగా ఎవరో బెదిరిస్తున్నారంటే ఇంత వరకూ ఆయన పోలీసులకు ఫిర్యాదు ఎందుకు చేయలేదు? అనేది ఆయనకే తెలియాలని నెట్టింట ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout