వర్మ గారు అండగా ఉండగా ఆ ఆలోచన ఎందుకు వస్తుంది - శాండీ

  • IndiaGlitz, [Wednesday,December 28 2016]

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం వంగ‌వీటి. సినిమా ప్రారంభం నుండి వార్త‌ల్లో నిలిచిన వంగ‌వీటి రిలీజ్ త‌ర్వాత వివాద‌స్ప‌మైన విష‌యం తెలిసిందే. ఈ వివాద‌స్ప‌ద చిత్రంలో వంగ‌వీటి రాధా, వంగ‌వీటి రంగా...ఈ రెండు పాత్ర‌ల్లో అద్భుతంగా న‌టించి శ‌భాష్ అనిపించుకున్నాడు యువ న‌టుడు శాండీ. సినీ ప్ర‌ముఖులు, ప్రేక్ష‌కుల అభినంద‌న‌లు అందుకుంటున్న‌సంద‌ర్భంగా శాండీతో ఇంట‌ర్ వ్యూ మీకోసం..!
సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి ఎలా వ‌చ్చారు..? మీ గురించి చెప్పండి..?
మాది కాకినాడ‌. అయితే హైద‌రాబాద్ లో సెటిల్ అయ్యాం. చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే బాగా ఇంట్ర‌స్ట్. న‌టుడు అవ్వాల‌నుకున్నాను. దాదాపు ఓ ఏడెనిమిది సంవ‌త్స‌రాలుగా ప్ర‌య‌త్నిస్తున్నాను. ఒక స్పానిష్ ఫిల్మ్ లో న‌టించాను. జ్యోతిల‌క్ష్మి సినిమాలో పూరి గారు అవ‌కాశం ఇచ్చారు. ఆత‌ర్వాత‌ లోఫ‌ర్ సినిమాలో కూడా అవ‌కాశం ఇచ్చారు.
వంగ‌వీటిలో అవ‌కాశం ఎలా వ‌చ్చింది..?
పూరి గారి ఆఫీస్ లో ఉన్న‌ప్పుడు వ‌ర్మ గారు చూసారు. వంగ‌వీటి సినిమా తీస్తున్నాను రాధా క్యారెక్ట‌ర్ కి నీ లుక్ ఎలా ఉంటుందో టెస్ట్ చేద్దాం అన్నారు.రాధా క్యారెక్ట‌ర్ కి ఓకే చేసిన త‌ర్వాత‌ రంగా, రాధా ఇద్ద‌రూ ఒకేలా ఉంటారు అని రంగా క్యారెక్ట‌ర్ కోసం మ‌రో టెస్ట్ చేసారు. ఆత‌ర్వాత రెండు క్యారెక్ట‌ర్స్ నువ్వే చేస్తున్నావ్ అని చెప్పారు.
మీ క్యారెక్ట‌ర్ కి వ‌స్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది..?
చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మా ఫ్రెండ్స్ & ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఇండ‌స్ట్రీలో తెలిసిన వాళ్లు చాలా మంది చాలా బాగా చేసావ్... క్యారెక్ట‌ర్ కి క‌రెక్ట్ గా స‌రిపోయావ్ అంటూ అభినందిస్తున్నారు.
వంగ‌వీటి క్యారెక్ట‌ర్ చేయ‌డం రిస్క్ ఏమో అని ఎప్పుడైనా ఫీల‌య్యారా..?
రిస్క్ ఏమో అనే ఆలోచ‌న ఎప్పుడూ రాలేదు. వ‌ర్మ గారు అండ‌గా ఉండ‌గా అలాంటి ఆలోచ‌న ఎందుకు వ‌స్తుంది..?
ఈ క్యారెక్ట‌ర్ కోసం హోమ్ వ‌ర్క్ చేసారా..?
విజ‌య‌వాడ‌లో అప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు గురించి నాకు పెద్ద‌గా తెలియ‌దు. తెలుసుకునేందుకు ఎవ‌రినీ క‌ల‌వ‌లేదు. రాధా క్యారెక్ట‌ర్ ఎలా బిహేవ్ చేస్తుందో నాకు తెలియ‌దు. క్యారెక్ట‌ర్ కి త‌గ్గ‌ట్టు వ‌ర్మ గారు ఎలా చెబితే అలా చేసాను అంతే కానీ పెద్ద‌గా హోమ్ వ‌ర్క్ అంటూ ఏమీ చేయ‌లేదు.
వంగ‌వీటి వివాద‌స్పం అయ్యింది క‌దా..! మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వ‌చ్చాయా..?
నాకు ఏలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు.
ఇక నుంచి ఎలాంటి క్యారెక్ట‌ర్స్ చేయాలి అనుకుంటున్నారు..?
ఓకే త‌ర‌హా పాత్ర‌లు కాకుండా అన్ని రకాల పాత్ర‌లు చేయాలి అనుకుంటున్నాను.
ఈ సినిమా చూసిన త‌ర్వాత మీకు అవ‌కాశాలు ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ఏమ‌న్నారు..?
చాలా బాగా న‌టించావు అంటూ అభినందించారు. పూరి గారే నా గాడ్ ఫాద‌ర్. ఆయ‌న‌తో సినిమా అంటే వెంట‌నే ఓకే అంటాను. వేరే సినిమాలు ప‌క్క‌న పెట్టైనా స‌రే పూరి గారి సినిమా చేస్తాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి..?
ప్ర‌స్తుతం డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు చెబుతాను.

More News

ఖబర్దార్ వ్యాఖ్యలకు క్లారటి ఇచ్చిన క్రిష్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో డైరెక్టర్ క్రిష్ చేసిన ఖబర్దార్ వ్యాఖ్యలు వివాదస్పదం

పవన్ , త్రివిక్రమ్ మూవీలో సీనియర్ హీరోయిన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది.

డైరెక్టర్ బలవంతం వల్లే పవన్ సినిమాలో చేసిందట....

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించాలంటే ఏ హీరోయిన్ అయినా ఆసక్తి చూపిస్తుంది.

విక్రమ్ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న....

విలక్షణ నటుడుగా పేరున్న వారిలో చియాన్ విక్రమ్ ఒకడు.

'డ్యూయెట్' షూటింగ్ పూర్తి....

కాష్మోరా సక్సెస్ తర్వాత కార్తీ హీరోగా ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో