వంగవీటి అభిమానుల ఆందోళన..!
Send us your feedback to audioarticles@vaarta.com
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వంగవీటి చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. ఈ చిత్రంలో వంగవీటిని ఎలా చూపించారో అని వంగవీటి రంగా అభిమానులు ఆసక్తిగా సినిమాని చూసారు. అయితే...సినిమాని చూసిన వంగవీటి అభిమానులు వంగవీటిని ఒక రౌడీగా చూపించారు అంటూ ఆందోళన చేస్తున్నారు.
అంతే కాకుండా వర్మ కేవలం డబ్బులు కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు. వాస్తవాలు తెలుసుకోకుండా తన ఇష్టం వచ్చినట్టుగా తీసాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సినిమాకి వంగవీటి అని టైటిల్ పెట్టడం దారుణం. వంగవీటి పరువు తీసారు. వంగవీటి రంగా గారిని ఎవరు చంపారో బెజవాడలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు.అలాంటిది సినిమాలో వేరేలా చూపించారు అంటూ రామ్ గోపాల్ వర్మ పై ఫైర్ అవుతున్నారు. మరి...వంగవీటి అభిమానులకు వర్మ ఏం సమాధానం చెబుతారో చూడాలి..!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com