Vande Bharat Express:ఘోరం : వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న జింక .. అది మీదపడి మనిషి మృతి

  • IndiaGlitz, [Thursday,April 20 2023]

దేశ ప్రజలకు సుఖవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు గాను రైల్వే శాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే భారతదేశంలో 13 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు అందుబాటులోకి రాగా.. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రస్తుతానికి సీట్లలతో కూడిన వందే భారత్‌లు పరుగులు తీస్తుండగా.. రానున్న రోజుల్లో బెర్త్‌లతో కూడిన రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాగా.. దేశంలోని పలు చోట్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఢీకొని మూగజీవాలు ప్రాణాలు కోల్పోతోన్న సంగతి తెలిసిందే. రైల్వే శాఖ, పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. మూగజీవాలు బలైపోతున్నాయి.

అటుగా వెళ్తున్న మనిషిపై పడ్డ జింక:

తాజాగా రాజస్థాన్‌లో వందే భారత్ రైలు ఢీకొని ఓ జింక మృతిచెందింది. అంతేకాదు.. అది ఎగిరి సమీపంలో వున్న మరో వ్యక్తిపై పడటంతో అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌ రాష్ట్రం అల్వార్‌లోని కలిమోరి రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడిని శివదయాల్‌గా గుర్తించారు. ఢిల్లీ నుంచి అజ్మీర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కాణంగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం కారణంగా ఈ రైలును కొద్దిసేపు నిలిపివేశారు. శివదయాళ్ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి. ఇతనికి ఇద్దరు కుమారులు వున్నారు. అత్యంత వేగంగా రైలు జింకను ఢీకొనడం.. అది అంతే వేగంగా శివదయాళ్‌పై పడటంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.

త్వరలో బెంగళూరు- సికింద్రాబాద్ మధ్య మూడో వందే భారత్ :

ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సికింద్రాబాద్-విశాఖపట్నం, సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు ప్రజలకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. త్వరలో సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు వందే భారత్ నడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంపై నేతలకు ఓ సంకేతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదే కనుక నిజమైతే బెంగళూరు, హైదరాబాద్ నగరాల మధ్య ప్రయాణించే వారు మరింత వేగంగా గమ్యస్థానాలను చేరవచ్చు. అంతేకాదు.. తెలుగు ప్రజలకు మూడు వందే భారత్‌లు ఇచ్చినట్లుగా అవుతుంది.

More News

Double Decker:ఏళ్ల తర్వాత హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు, ఏయే రూట్లలో అంటే..?

భాగ్యనగర వాసుల చిరకాల వాంఛ అయిన డబుల్ డెక్కర్ బస్సులు దశాబ్ధాల తర్వాత తిరిగి హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టాయి.

Prema Vimanam:ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా జీ5 & అభిషేక్ పిక్చర్స్ నిర్మించిన వెబ్ ఫిల్మ్ 'ప్రేమ విమానం' ఫస్ట్ లుక్ పోస్టర్

గూఢచారి, రావణాసుర వంటి అద్భుతమైన సినిమాలను నిర్మించిన అభిషేక్ పిక్చర్స్ ఇప్పుడు ఓ వెబ్ ఫిల్మ్‌ను నిర్మించింది.

CM Jagan:సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం.. మూడు రాజధానులపై తేల్చేసిన జగన్

2019 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ .. మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.

HYD:ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్.. ఎంతమంది మిలియనీర్లు వున్నారో తెలుసా..?

తెలుగువారి భాగ్యనగరం, హైటెక్ సిటీ హైదరాబాద్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది.

Priyanka Mohan:పవన్ కళ్యాణ్ సరసన కథానాయికగా ప్రియాంక మోహన్

ఆస్కార్ విజేత అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో