"వానవిల్లు" ఆడియో వేడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్, శ్రావ్య, విశాఖ హీరో హీరోయిన్లుగా లంకా కరుణాకర్ దాస్ నిర్మాతగా ప్రతీక్ ప్రేమ్ కరణ్ హరోగా నటిస్తూ దర్శకత్వం వహించారు. ప్రభు ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఎస్.వి.కృష్ణారెడ్డి ఆడియో సీడీలను విడుదల చేయగా, హీరో ప్రతీక్ ప్రేమ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి తొలి సీడీని అందుకున్నారు.
ఈ సందర్బంగా బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. "ప్రతీక్ నాకు బాగా పరిచయం. తను సినిమాపై ప్యాషన్‌తో సినిమాల్లో రాణించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరకు తనే ఓ యంగ్ టీంను రెడీ చేసుకుని సినిమాను అన్ని హంగులతో రెడీ చేశాడు. నేను సినిమాను చూశాను. కమర్షియల్ ఎంటర్‌టైనర్. తనకు మంచి భవిష్యత్ ఉంది. టీం అంతటికి ఆల్ ది బెస్ట్" అన్నారు.
కోటి మాట్లాడుతూ.. "సాంగ్స్ బావున్నాయి. హీరో ప్రతీక్..తమిళ హీరో విజయ్‌లా ఉన్నాడు. ప్రభు ప్రవీణ్. తను నాగూర్ బాబు సోదరి తనయుడు. తన మంచి డమ్మర్. తన స్టైల్ ఆఫ్ డ్రమ్మింగ్ శివమణికి ఈక్వల్‌గా ఉంటుంది. ఎక్సలెంట్ టీం కలయికలో చేసిన సినిమా ఇది. ఈ టీం పడ్డ కష్టాన్ని ఆడియెన్స్ ఆదరిస్తారు. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్" అన్నారు.
ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. "హీరో కథ, స్క్రీన్‌ప్లే, డ్యాన్సులు, ఫైట్స్ అన్ని చూసుకుంటూ డైరెక్ట్ చేశాడు. ఇంత చేయాలంటే కసి ఉండాలి. కసి ఉండబట్టే..నేను దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్, స్క్రీన్‌ప్లే రైటర్, హీరోను చేసింది. ఈ వానవిల్లు టీంలో మంచి కసి కనపడుతుంది. ఈ యూనిట్ పడ్డ శ్రమ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు.
హీరో, దర్శకుడు ప్రతీక్ ప్రేమ్ కరణ్ మాట్లాడుతూ.. "రెండున్నరేళ్లుగా ఈ సినిమాతో జర్నీ ఉంది. ప్రొడక్షన్, డైరెక్షన్, హీరోగా నటన ఇలా అన్ని విభాగాల్లో నేను భాగమయ్యాను. చిన్నప్పట్నుంచి డైరెక్టర్ కావాలనే కోరిక ఈ రోజు నిజమైంది. నా వంతుగా నేను మంచి ప్రయత్నమే చేశాను. ప్రతి సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఓ స్టార్ అని భావిస్తాను. మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మ్యూజిక్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను.
ఓ స్టూడెంట్‌గా ఇక్కడకొచ్చి నేను చేసిన సినిమా. నాన్న దగ్గరకు వెళ్లి నేను డైరెక్టర్ అవుతాననగానే, ఆయన నన్ను ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. నా సినిమాకు స్టూడెంట్స్ ఎక్కువగా పనిచేశారు. ఈ సినిమా సక్సెస్ అయినా కాకపోయినా, మళ్లీ సినిమా చేస్తాను. సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఆ కష్టం రేపు తెరపై కనపడతుంది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్" అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు ప్రవీణ్ మాట్లాడుతూ.."ప్రేమ్ ప్రతీక్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. మా కాంబినేషన్‌లో తదుపరి సినిమా కూడా ఉంటుంది" అన్నారు.
నిర్మాత లంకా కరుణాకర్ దాస్ మాట్లాడుతూ.. "నేను సినిమా రంగంలో..మ్యూజిక్ రంగంలో ఉండేవాడిని. పూర్తిగా తప్పుకుని దూరంగా ఉన్నాను. ఇటు వైపు రాకూడదని అనుకున్నాను. కానీ ప్రేమ్ నన్ను ఈవైపుకు తీసుకొచ్చాడు. మా అబ్బాయి ప్రతీక్ ఏదో గొప్ప విషయం చేస్తాడని నమ్మకం ఉంది. అందుకనే, తనకు పూర్తి సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను" అన్నారు.
గూడూరు నారాయణరెడ్డి, వి.ప్రకాష్, విలన్స్, డొక్కా మాణివక్య వరప్రసాద్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ప్రతీక్ ప్రేమ్‌కరణ్, శ్రావ్య, విశాఖ, హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్ధస్త్ ఫణి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్, డైలాగ్స్: పవన్, ఫైట్స్: నందు, ప్రొడక్షన్ మేనేజర్: సుబ్బారావు, అసోసియేట్ డైరెక్టర్స్: సుభాష్, నరేష్, అసిస్టెంట్ డైరెక్టర్స్: జై, మూర్తి, కెమెరామెన్: ఎస్.డి. జాన్, నిర్మాత: లంకా కరుణాకర్ దాస్, స్క్రీన్‌ప్లే-ఎడిటింగ్-దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్ కరణ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments