పూరీ బాటలో వంశీ కూడా వెళతారా?
Send us your feedback to audioarticles@vaarta.com
పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శ్రీనువైట్ల, సుకుమార్ ఈ నలుగురు దర్శకులకి సంబంధించి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే.. అగ్ర కథానాయకులు మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ .. ఇలా ఈ ముగ్గురుతోనూ సినిమాలు చేసిన దర్శకులు వీరు. అయితే.. ఈ ముగ్గురితోనూ విజయాలను అందుకున్న డైరెక్టర్ మాత్రం పూరి జగన్నాథ్ మాత్రమే. మహేశ్‌తో ‘పోకిరి’, ఎన్టీఆర్‌తో ‘టెంపర్’, చరణ్‌తో ‘చిరుత’ సినిమాలు చేసి ఆయన విజయాలను అందుకున్నారు.
ఈ నలుగురు దర్శకులతో పాటు ఈ ముగ్గురి హీరోలతో సినిమాలు చేసిన దర్శకుడిగా వంశీ పైడిపల్లి కూడా చేరనున్నారు. ఇప్పటికే.. ఈ దర్శకుడు ఎన్టీఆర్‌తో ‘బృందావనం’, చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలను చేసి మంచి విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం మహేశ్ 25వ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు వంశీ. అమెరికా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి అశ్వనీదత్, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరి.. ఎన్టీఆర్, చరణ్‌తో హిట్స్‌ను అందుకున్న వంశీ మహేశ్‌తో కూడా విజయాన్ని అందుకుని.. పూరి జగన్నాథ్ సరసన నిలుస్తారో, లేదో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com