వంశీ మ్యూజిక్ తో... ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ
Send us your feedback to audioarticles@vaarta.com
మహదేవ్, ఐశ్వర్య, సిరిశ్రీ, పునర్ణవి ప్రధాన పాత్రల్లో చందు ముద్దు తెరకెక్కించిన చిత్రం ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ. ఈ చిత్రాన్నిపి.ఎస్.సూర్య తేజా రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని రెండు పాటలకు సీనియర్ డైరెక్టర్ వంశీ సంగీతం అందించడం విశేషం. ఈ చిత్రాన్ని ఈనెల 11న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో...సీనియర్ డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ...ఈ సినిమాలో రెండు పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసాను. డైరెక్టర్ చందు మంచి మిత్రుడు. ఈ సినిమా చూసిన వారందరూ బాగుంది అంటున్నారు.రిలీజ్ తర్వాత జనం కూడా ఈ సినిమా గురించి అద్భుతంగా మాట్లాడతారని అనుకుంటున్నాను అన్నారు. చిత్ర దర్శకుడు చందు ముద్దు మాట్లాడుతూ..వంశీ గారు నా సినిమాలోని రెండు పాటలకు సంగీతం అందించడం ఆనందంగా ఉంది. ఇది క్లీన్ ఎంటర్ టైనర్. స్ర్కీన్ ప్లే కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మహదేవ్, హీరోయిన్ పునర్ణవి, సంగీత దర్శకుడు మారుతీ రాజా పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments