వంశీకి ఫైన‌ల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ దొరికాడు..!

  • IndiaGlitz, [Thursday,October 06 2016]

గోదావరి అందాలను అత్యంత అద్భుతంగా తెరకెక్కించి... తెలుగు తెరపై తనదైన ముద్ర వేసిన క్రియేటివ్‌ డైరెక్టర్‌ వంశీ. మాస్ రాజా ర‌వితేజ హీరోగా వంశీ లేడీస్ టైల‌ర్ చిత్రానికి సీక్వెల్ గా ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ అనే చిత్రాన్ని రూపొందించాలి అనుకున్నారు. కానీ...ఎందుక‌నో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఆత‌ర్వాత రాజ్ త‌రుణ్ అనుకున్నారు కుద‌ర‌లేదు.

ప్ర‌ముఖ నిర్మాత సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వంశీ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్న‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. కానీ...ఇది కూడా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఫైన‌ల్ గా వంశీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ చిత్రాన్ని యువ హీరో సుమంత్ అశ్విన్ తో చేయ‌నున్న‌ట్టు ద‌ర్శ‌క‌నిర్మాత మ‌ధుర శ్రీధ‌ర్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు.

More News

అప్పుడే బాల‌య్య రెడీ అవుతున్నాడు...

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి షూటింగ్ లో బిజీగా ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ...గౌత‌మిపుత్ర‌శాత‌క‌ర్ణి 100వ చిత్రం కావ‌డంతో అభిమానులు, ప్రేక్ష‌కులు సినిమాపై చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

100% కొత్త‌గా ఉండే లాఫింగ్ ఫీస్ట్ విత్ ట్విస్ట్ ఈడు గోల్డ్ ఎహే - డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌

వ‌ర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసి...బిందాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ సాధించిన రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ వీరు పోట్ల‌. ఆత‌ర్వాత ర‌గ‌డ‌, దూసుకెళ్తా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాలు సాధించిన వీరు పోట్ల తాజాగా తెర‌కెక్కించిన చిత్రం ఈడు గోల్డ్ ఎహే.

'దేశవాళి వినోదం' పంచే 'జయమ్ము నిశ్చయమ్మురా' సమైక్యంగా నవ్వుకుందాం రండి!

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమాలను-సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలుగా పేర్కొంటుంటారు.

కత్తి కంటే కలం ఎంత గొప్పదో నిరూపించే సినిమా ఇజం - ఎన్టీఆర్

డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతున్నపవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై

నిన్న జగపతి - నేడు రానా..!

జురాసిక్ పార్క్ ,జాస్,ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిల్ బర్గ్ దర్శకత్వం లో రూపొందిన అద్భుతమైన ఫాంటసి ది బి ఎఫ్ జి(ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్)చిత్రంలో