close
Choose your channels

బంధాలు - బంధుత్వాల ప్రాముఖ్య‌త తెలియ‌చెప్పే మ‌నంద‌రి క‌థ ఊపిరి - డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి

Wednesday, March 23, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మున్నా, బృందావ‌నం, ఎవ‌డు..చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తాజా చిత్రం ఊపిరి. టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన ఊపిరి చిత్రాన్ని పి.వి.వి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. తెలుగు, త‌మిళ్ లో రూపొందిన ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ఈనెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఊపిరి డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి తో ఇంట‌ర్ వ్యూ మీకోసం....

ఫ్రెంచ్ ఫిల్మ్ ఇన్ ట‌చ్ బుల్స్ చిత్రాన్ని ఊపిరి టైటిల్ తో రీమేక్ చేయాల‌ని ఎందుకు అనిపించింది..?

ఎవ‌డు సినిమా చేస్తున్న‌ప్పుడు ఇన్ ట‌చ్ బుల్స్ మూవీ చూసాను.నాకు బాధ క‌లిగించే సినిమాలు చూడాలంటే భ‌యం. ఇందులో వీల్ ఛైర్ లో కూర్చొని ఉన్నారు క‌దా సినిమా ఎలా ఉంటుందో అనుకున్నాను. కానీ...సినిమాని బిగినింగ్ నుంచి చివ‌రి వ‌ర‌కు అలా చూస్తుండిపోయాను. సినిమా అయిపోయింది కానీ..నేను కూర్చున్న కుర్చీలోంచి లేవ‌లేక‌పోయాను.అప్పుడు ఖ‌చ్చితంగా ఈ సినిమా చేయాల‌నుకున్నాను.

నాగార్జున క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

ఈ సినిమాలో నాగ్ సార్ రిచ్ మేన్. కానీ..అనుకోని విధంగా వీల్ ఛైర్ కి ప‌రిమితం కావ‌ల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. వీల్ ఛైర్ లో కూర్చున్నా...అత‌ని చుట్టూ ఎంట‌ర్ టైన్మెంట్ ఉంటుంది. ఈ క్యారెక్ట‌ర్ కి సింప‌తి ఇష్టం ఉండ‌దు. ఒకే జీవితంలో రెండు జీవితాలు చూసిన వ్య‌క్తి క‌థ‌.ఈ సినిమాకి ఎందుకు క‌నెక్ట్ అవుతారు అంటే ఎవ‌రికైనా తోడు ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రికి తోడు ఎవ‌రో ఒక‌రు ఉంటారు.ఆ తోడుతో బాధ పంచుకున్న‌ప్పుడు ఇచ్చే రిలీఫే ఊపిరి. ఇది రివేంజ్ క‌థ కాదు. మ‌న జీవితం లాంటి క‌థ‌. బంథాలు - బంధుత్వాలు ప్రాముఖ్య‌త తెలియ‌చెప్పే క‌థ. ఇది మ‌నంద‌రి క‌థ‌.

నాగార్జున క్యారెక్ట‌ర్ కి ష్లాష్ బ్యాక్ ఉంటుందా..?

నేను సెకండాఫ్ లో నాగార్జున గారి క్యారెక్ట‌ర్ కి ష్లాష్ బ్యాక్ పెట్టాను. అయితే నాగార్జున గార్కి సెకండాఫ్ చెప్పిన‌ప్పుడు ఫ‌స్టాఫ్ అంతా బాగుంది. కానీ సెకండాఫ్ లో నాకోస‌మ‌ని ష్లాష్ బ్యాక్ పెట్ట‌డం బాగోలేదు అన్నారు. నాగార్జున గారే అలా చెప్ప‌డంతో ష్లాష్ బ్యాక్ పెట్ట‌లేదు.

వీల్ ఛైర్ క్యారెక్ట‌ర్ కి నాగార్జున‌నే సెలెక్ట్ చేసుకోవ‌డానికి కార‌ణం ఏమిటి..?

నాగార్జున గారు చాలా డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసారు. అందుచేత‌ ఈ క్యారెక్ట‌ర్ ని నాగార్జున గారు చేస్తేనే బాగుంటుంది. ఈ విష‌యం నాగార్జున గార్కి కూడా చెప్పాను. మీరు చేయ‌క‌పోతే ఈ సినిమా చేయ‌ను అని. క‌థ ఇది అని చెప్ప‌గానే ఆల్రెడీ సినిమా చూసాను చేస్తాను అన్నారు.

నాగార్జున‌ని వీల్ ఛైర్ కే ప‌రిమితం చేస్తే ఆడియోన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆలోచించారా..?

సినిమాని క‌న్విషింగ్ గా చూపిస్తే చూస్తారు. అన్న‌మ‌య్య సినిమా చేస్తున్న‌ప్పుడు నాగార్జున గారు ఏమిటి..? అన్న‌మ‌య్య సినిమా చేయ‌డం ఏమిటి.? అనుకున్నారు. కానీ..సినిమా వ‌చ్చాకా ఎంత‌గా ఆద‌రించారో మ‌నం చూసాం. అప్ప‌ట్లో ఎన్టీఆర్ - ఎ.ఎన్.ఆర్ ఇలా డిఫ‌రెంట్ రోల్స్ ఎన్నో చేసారు. ప్రేక్ష‌క‌లు ఆద‌రించారు. నాగార్జున - కార్తీ హీరోలుగా కాకుండా రెండు పాత్ర‌లు పోషించారు. సినిమా చూస్తున్న‌ప్పుడు ఇది ఎక్క‌డో మ‌న ఫ్రెండ్ లైఫ్ లో జ‌రిగింది క‌దా అనిపిస్తుంటుంది. అందుచేత ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే డౌట్ రాలేదు.

కార్తీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వ్య‌క్తి. మ‌న‌సులో ఏది దాచుకోకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడేస్తుంటాడు. అలాంటి వ్య‌క్తి.. వీల్ ఛైర్ కి ప‌రిమిత‌మై తోడు కోసం ఎదురుచూస్తున్న వ్య‌క్తికి తోడుగా ఉంటే వీరిద్ద‌రి జీవితాలు ఎలా ఉంటాయి అనేది చూపించాం. ఇంకా చెప్పాలంటే కార్తీ క్యారెక్ట‌ర్ ట్రైల‌ర్ లో చూపించిన‌ట్టు చాలా ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది.

కార్తీ ఓకే అయిన త‌ర్వాతే త‌మిళ్ లో చేయాల‌నుకున్నారా..? ముందే తెలుగు, త‌మిళ్ లో చేయాల‌నుకున్నారా..?

కార్తీ వ‌ల్లే త‌మిళ్ లో చేసాం. కార్తీ గురించి ఒక విష‌యం చెప్పాలి. ఆవారా, నా పేరు శివ సినిమాల్లో కార్తీ ఏక్టింగ్ చూసి షాక‌య్యాను. పాత్ర కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. ఎంత‌లా అంటే..గోళ్లు కూడా పెంచాడు. ఎందుకు గోళ్లు పెంచుతున్నావ్ కార్తీ అంటే స్ల‌మ్ లో ఉండే క్యారెక్ట‌ర్ క‌దా...అందుక‌నే పెంచాను అన్నాడు. క్యారెక్ట‌ర్ కోసం ఇంత‌లా ఆలోచిస్తారా అనిపించింది. త‌మిళ్ వెర్షెన్ కోసం కార్తీ ఒక అసిస్టెంట్ డైరెక్ట‌ర్ లా వ‌ర్క్ చేసాడు. నిజంగా కార్తీ ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాడు.

హీరోయిన్ గా ముందు శృతిహాస‌న్ ని అనుకున్నారు క‌దా..?

అవును..ముందుగా శృతిహాస‌న్ అనుకున్నాం. డేట్స్ ప్రాబ్ల‌మ్ వ‌ల‌న కుద‌ర‌లేదు. కాక‌పోతే రేపు షూటింగ్ అన‌గా ఈరోజు ఈ సినిమా చేయ‌లేన‌ని చెప్ప‌డం బాధ అనిపించింది. ల‌క్కీగా మాకు త‌మ‌న్నాసెట్ అయ్యింది.

త‌మ‌న్నా క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

ఈ సినిమాలో నాగార్జున గారికి పి.ఎ గా న‌టించింది. నాగార్జున గారు - కార్తీ వీరిద్ద‌రికీ వార‌థిలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్ట‌ర్. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు అద్భుతంగా న‌టించింది.

ఓరిజిన‌ల్ కి ఊపిరి కి ఎలాంటి మార్పులు చేసారు..?

ఓరిజిన‌ల్ లోని షోల్ మాత్ర‌మే తీసుకున్నాం. మ‌న నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులు చేసాం. ఎందుకంటే వాళ్ల ఎమోష‌న్ ఒక‌లా ఉంటుంది. మ‌న ఎమోష‌న్ ఇంకోలా ఉంటుంది. అందుచేత చాలా మార్పులు చేసాం. ఇంకా చెప్పాలంటే ఫ్రెంచ్ ఫిలిమ్ తో పోలిస్తే 60 కొత్త సీన్స్ ఉంటాయి.

ఊపిరి మీలో ఎలాంటి మార్పు తీసుకువ‌చ్చింది..?

నాకు ఊపిరి సినిమా ఎంత ఇంపార్టెంటో మున్నా, బృందావ‌నం, ఎవ‌డు చిత్రాలు కూడా అంతే ఇంపార్టెంట్. కాక‌పోతే ఈ సినిమాతో న‌న్ను నేను తెలుసుకున్నాను. గ‌తంలో చేసిన త‌ప్పులు ఇక మీద‌ట చేయ‌కూడ‌దు అని నిర్ణ‌యించుకున్నాను. అలాగే ఈ సినిమా చేసిన త‌ర్వాత స‌హ‌నం పెరిగింది. నా లైఫ్ నే మార్చింది ఊపిరి. నిజంగా ఊపిరి నాకు ఒక వ‌రం.

ఎవ‌డు ( ఫేస్ ఆఫ్) ఊపిరి (ఇన్ ట‌చ్ బుల్స్) హాలీవుడ్ మూవీస్ నే రీమేక్ చేస్తుండ‌డానికి కార‌ణం..?

ఎవ‌డు సినిమా చేస్తున్న‌ప్పుడు ఫేస్ ఆఫ్ అనే సినిమా గురించే తెలియ‌దు. అయినా ఎవ‌డు ఫేస్ ఆఫ్ సినిమా కాదు. ఎవ‌డు అనేది ఓ త‌ల్లి తీసుకున్న ఎమోష‌నల్ క‌థ‌. అయినా ఇన్ స్పిరేష‌న్ తీసుకుంటే త‌ప్పేమి కాదు.

ఎవ‌డు త‌ర్వాత ఇంత గ్యాప్ రావ‌డానికి కార‌ణం ఏమిటి..?

జ‌న‌వ‌రిలో ఎవ‌డు సినిమా రిలీజ్ చేస్తే..ఆగ‌ష్టు లో ఈ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది. నాగార్జున గారు, కార్తీ వేరే ప్రాజెక్ట్స్ బిజీగా ఉండ‌డం వ‌ల‌న కాస్త లేట‌య్యింది అంతే. అయినా ఈ సినిమాకి 110 రోజులు షూటింగ్ చేసాం. పెద్ద డైరెక్ట‌ర్స్ మూడు నాలుగు సంవ‌త్స‌రాలు టైమ్ తీసుకుని సినిమా చేస్తున్నారు క‌దండీ..

ఫ్యారీస్ లో షూటింగ్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంది..?

ఫ్యారీస్ లో షూటింగ్ చేయ‌డం నిజంగా మ‌ర‌చిపోలేని అనుభూతి అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే మా సినిమా గురించి తెలుసుకుని..ఇన్ ట‌చ్ బుల్ ఇండియ‌న్ రీమేక్ అట అని మాకు షూటింగ్ కి ప‌ర్మిష‌న్ ఎక్క‌డ కావాలంటే అక్క‌డ ఇచ్చారు. అక్క‌డ ఇన్ ట‌చ్ బుల్ సినిమా ఎలాంటి మార్పును తీసుకువ‌చ్చిందో అక్క‌డ వాళ్లు చెప్పిన‌ప్పుడు సినిమా ఎంత‌గా మార్పు తీసుకువ‌స్తుందో..అస‌లు సినిమా గొప్ప‌త‌నం ఏమిటో తెలిసింది.

తెలుగు - త‌మిళ్ కి కూడా మార్ప‌లు చేసారు క‌దా..ఎందుక‌ని..?

ఫ్రెంచ్ ఫిల్మ్ కి మ‌న తెలుగు నేటివిటీకి మార్పులు ఎలాగైతే చేసాను. అలాగే తెలుగు, త‌మిళ్ కి కూడా మార్పులు చేసాను. ఎందుకంటే మ‌న ఎమోష‌న్ కి వాళ్ల ఎమోష‌న్కి తేడా ఉంటుంది. ఒక్కో సంఘ‌ట‌న‌కి మ‌నం ఒక‌లా రియాక్ట్ అవుతాం. తమిళ‌నాడులో వేరేలా రియాక్ట్ అవుతారు. అందుక‌నే మార్పులు చేసాం.

ఇంత‌కీ..మీ ఊపిరి ఎవ‌రు..?

నాకు ఊపిరి అంటే మా ఫ్యామిలీ.

మీ త‌దుప‌రి చిత్రం అఖిల్ తో అని తెలిసింది వివ‌రాలు చెబుతారా..?

ఊపిరి రిలీజ్ త‌ర్వాతే అఖిల్ సినిమా గురించి పూర్తి వివ‌రాలు చెబుతాను.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment