'వాల్మీకి' విడుద‌ల ఫిక్స్‌

  • IndiaGlitz, [Sunday,June 09 2019]

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా హ‌రీష్ శంక‌ర్‌.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'వాల్మీకి'. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'జిగ‌ర్‌తండా'కు ఇది తెలుగు రీమేక్‌. ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ మ‌న తెలుగు ప్రేక్ష‌కుల నెటివిటీకి త‌గ్గ‌ట్టు క‌థ‌లో మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కిస్తున్నాడు. త‌మిళంలో బాబీ సింహ పాత్ర‌ను తెలుగులో వ‌రుణ్ తేజ్ చేస్తున్నాడు.

ఇదొక గ్యాంగ్ స్ట‌ర్ పాత్ర‌. త‌మిళంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా సిద్ధార్థ్ చేసిన పాత్ర‌లో త‌మిళ హీరో అధ‌ర్వ ముర‌ళి న‌టిస్తున్నాడు. హీరోయిన్‌గా పూజా హెగ్డే న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే ఈమె యూనిట్‌తో జాయిన్ అవ‌బోతున్నారు. ఈలోపు వ‌రుణ్ స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 6న విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావిస్తుంది.

More News

గోపీచంద్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సినిమా టైటిల్ 'చాణక్య‌'

గోపీచంద్ హీరోగా ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తిరు ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్ల‌ర్ చిత్రానికి `చాణక్య‌`

ఇదేం మామూలు విషయం కాదు: లక్ష్మీనారాయణ

ఆంధప్రదేశ్ ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ షాక్ నుంచి తేరుకోక మునుపే నేతలు జంపింగ్‌లు షురూ చేశారు.

ఆయన్ను చూసే ఇండస్ట్రీలోకి వచ్చా.. నా పూర్వ జన్మ సుకృతం!

మహానటుడు ఎస్వీ రంగారావు జీవిత చరిత్రపై రచించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం నేడు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

జగన్ కేబినెట్‌లో ముగ్గురు #NNN #SSS #MMM!

టైటిల్ చూడగానే.. ఇదేంటి దర్శకధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న #RRR చిత్రం గురించి విన్నంకానీ..

రిస్క్ చేస్తున్న దిల్‌రాజు

స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మాత‌.. కేవ‌లం సినిమాల‌ను నిర్మించ‌డ‌మే కాదు.. డిస్ట్రిబ్యూట్ కూడా చేస్తుంటాడు.