వంశీ వర్సెస్ లోకేష్.. ఆ వెబ్సైట్లతో నాకేంటి సంబంధం!?
- IndiaGlitz, [Friday,November 15 2019]
టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ అధినేత మొదలుకుని నారా లోకేష్ ఇలా అందరి నేతలపై వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వంశీ వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో పార్టీ నుంచి వంశీని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్రమంలో వంశీపై టీడీపీ పెద్దలు, ద్వితియ శ్రేణి నేతలు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సందర్భంగా మరోసారి నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ వంశీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోకేశ్‌కు కౌంటర్!
వంశీ తనపై సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వంశీ.. లోకేశ్ కేమీ పనీపాటా లేదు కనుక సోషల్ వెబ్ సైట్స్ మెయిన్‌టెన్ చేస్తున్నాడని, వీటి ద్వారా రాజ్యాధికారం వస్తుందని, జనాలను భ్రమపెట్టొచ్చని, ప్రభావితం చేయొచ్చని అనుకుంటున్నాడని, ‘ఇది తప్పు’ అని హితవు పలికారు. పిచ్చి పదవుల కోసం లోకేశ్ వెనుక ఎవరైనా తిరుగుతారేమోకానీ, తన లాంటి ఎవరూ తిరగరని అన్నారు.
లోకేశ్ రియాక్షన్..
‘పార్టీలోకి చాలా మంది నాయకులు వస్తారు.. పోతారు.. అలాంటి వారి గురించి చర్చించాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉంది. నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉంటారు. ఎన్నికల ముందు జగన్‌ని తిట్టిపోసిన వ్యక్తి ఇప్పుడు ఆయన పంచకే చేరారు. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని నాకు ఆపాదించడం తగదు. ఎవరో వార్తలు రాస్తే నేనెలా బాధ్యుడిని అవుతాను?. ఆ వెబ్సైట్లతో నాకెలాంటి సంబంధం లేదు. ఎవరికి భూమి కేసులున్నాయో వాళ్లే పార్టీ వీడి వెళ్తున్నారు. ఐదు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.. ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయింది. ఇకపై జగన్ గెలిచే అవకాశమే లేదు’ అని ట్విట్టర్లో లోకేష్ జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై వల్లభనేని, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. మొత్తానికి చూస్తే నిన్న రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ వంశీ.. ఇవాళ్టి నుంచి వంశీ వర్సెస్ లోకేశ్‌గా పరిస్థితులు మారే అవకాశాలున్నాయ్. అంటే మాటల యుద్ధం తప్పేలా లేదు.