చంద్రబాబుపై వల్లభనేని వంశీ షాకింగ్ కామెంట్స్

  • IndiaGlitz, [Thursday,November 14 2019]

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్ట్రాంగ్ కౌంటర్, షాకింగ్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు దీక్షకు దిగిన రోజే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదని, అప్పుడే చంద్రబాబు దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము కూడా రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీలు ఇచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతకాలం తర్వాత రైతు రుణమాఫీ మొదలుపెట్టామో, ఎన్ని దశలుగా చేశామో, ఎప్పటి వరకు చేశామో ప్రజలందరికీ తెలుసని అన్నారు. అదేవిధంగా డ్వాక్రా రుణమాఫీ గురించీ అందరికీ తెలుసని చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలని, ఆ పని చంద్రబాబు చేయలేదని, అందుకే, ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా ఆయన పోషించలేకపోతున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఆ శక్తి ఇవ్వాలని..!

‘ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నదుల్లో ఇసుకను మనం తీయగలమా? వర్షాలు, వరదలు ఉన్న సమయంలో ఇసుకను బయటకు తీసే సాంకేతిక టెక్నాలజీ మన దగ్గర ఉందా? చంద్రబాబు సెల్ ఫోన్, కంప్యూటర్.. కనిపెట్టారని తమ మిత్రులందరూ చెబుతుంటారు కనుక, ఇలాంటి టెక్నాలజీని కూడా కనిపెట్టే శక్తిని భగవంతుడు ఆయనకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మంచిపని చేసినప్పుడు సమర్థించాలని, అదే, మంచిపని కాకపోతే విమర్శించాలి’ అని వంశీ సూచించారు.

వైసీపీకే మద్దతు!

వైసీపీ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, సీఎం జగన్ తో కలిసి నడుస్తానని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం జగన్మోహన్ రెడ్డిని కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. జగన్ తనకు చేసిన ప్రామిస్ మేరకు ఆయనతో కలిసి నడుస్తానని చెప్పారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తప్పులు జరుగుతాయని, తమ హయాంలో కూడా జరిగాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కొంత మంది అధికారుల కారణంగా తప్పులు జరిగాయని, ఈ విషయాన్నిజగన్ దృష్టికి తీసుకెళ్లానని, వాటిని సరిచేస్తానని తనకు చెప్పారని తెలిపారు. మొత్తానికి చూస్తే అతి త్వరలోనే వంశీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని తాజా వ్యాఖ్యలను బట్టి తెలుస్తో్ంది.

More News

అనారోగ్యంపై స్పందించిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు

ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తన ఆరోగ్యంపై నిన్న కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించారు. ‘కేవలం న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు

‘మళ్లీ చెప్తున్నా.. అగౌరపరిస్తే మట్టిలో కలిసిపోతారు’

‘మట్టిలో కలిసిపోతారు అనే మాట నేను ఆవేశంలో అనలేదు. తెలుగు భాషని మీరు అగౌరపరిస్తే మట్టిలో కలిసిపోతారు మళ్లీ చెప్తున్నా. భాషల్ని గౌరవించే సంప్రదాయం మా పార్టీది’ అని

బాబు దీక్ష రోజే ఝలక్.. దేవినేని రాజీనామా.. వైసీపీలోకి!

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దీక్షకు దిగిన రోజే విజయవాడకు చెందిన ముఖ్యనేత

జగన్‌ను.. ‘జగన్ రెడ్డి’ అనడంపై పవన్ వివరణ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని.. జగన్ రెడ్డి అంటున్నందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే.

ఏఎన్నార్ జాతీయ అవార్డ్స్: చిరు చేతుల మీదుగా ప్రదానం

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఏఎన్నార్ జాతీయ అవార్డు పేరుతో ‘అక్కినేని అవార్డులు’ ఇవ్వడం మొద‌లెట్టిన విషయం తెలిసిందే. ఆయన మరణాంతరం ఆ ప‌రంప‌ర‌ని ఏఎన్నార్ కుమారుడు అక్కినేని నాగార్జున కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు.