వైసీపీ అభ్యర్థికి వల్లభనేని వంశీ బహిరంగ లేఖ..!
Send us your feedback to audioarticles@vaarta.com
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీ వర్సెస్ టీడీపీగా పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సీజన్ ప్రారంభం మొదలుకుని నేటి వరకు అటు వైసీపీ-టీడీపీ అభ్యర్థులు, కార్యకర్తల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత రీతిలో పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ తరుణంలో వల్లభనేని వంశీ తన ఇంటికి బెదిరించాడని.. తనకు సన్మానం చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం గత వారం రోజులుగా సోషల్ మీడియా, టీవీ చానెళ్లలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అంతేకాదు సీసీ టీవీ ఫుటేజీని ఆధారాలుగా యార్లగడ్డ పోలీసులకు చూపించడంతో ఈ వ్యవహారంపై వంశీ ఎట్టకేలకు రియాక్టయ్యారు. వల్లభనేని తన ఫేస్బుక్లో రియాక్ట్ అయ్యాడు.
వల్లభనేని వంశీ ఫేస్బుక్ పోస్ట్ యథావిథిగా...
"యార్లగడ్డ వెంకట్రావ్ గారికి...నేను వల్లభనేని వంశీ.. నన్ను నేను పరిచయం చేసుకోనక్కర్లేదనుకుంటా. గతంలో జరిగిన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. రమేశ్ అనే వ్యక్తి మీపై ఎస్సీ/ఎస్టీ కేసు మీ మీద పెట్టినప్పుడు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేశాను. అదొక్క విషయమే కాదు పలు విషయాల్లో మీకు నేను నావంతుగా సాయం చేశానెు. మన పరస్పర స్నేహితుడైన కొడాలి నాని చెప్పినందుకు గాను నేను సాయం చేశాను. భవనపురం పోలీస్ స్టేషన్లో వరకట్నం వేధింపుల కేసునుంచి నేను మీకు సహాయం చేశాను. అలాగే మీకు మీ పాస్‌పోర్టు స్వాధీనం చేసుకోకపోవడంతో మీరు ఆ కేసులనుంచి బయటికి రావటానికి నాకు సహాయం చేసినందుకు మీరు కొడాలి నానికి కృతజ్ఞులై ఉండాలి. మీరు వైసీపీ అభ్యర్థిగా గన్నవరంకు వచ్చినంతవరకు మనిద్దరం కలుసుకోలేదు.. ఎప్పుడూ మాట్లాడుకోలేదు కూడా. గన్నవరం వచ్చిన తరువాత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో నేను కలుసుకున్నాను. అప్పట్లో కేసరపల్లి గ్రామంలో మీ అనుచరులు ఒక బ్యానర్‌ను ఏర్పాటు చేశారని ఒక రోజు నేను మిమ్మల్ని పిలిపించాను. ఇప్పటి వరకు నేను మూడు సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. నేను టీడీపీ ప్రభుత్వం గురించి, అభివృద్ధి పథకాల గురించి మాత్రమే చెప్పుకుంటూ జనాల్లోకి వెళ్లాను. అంతే తప్ప నేనెప్పుడు లగడపాటి గురించి కానీ దత్తా గురించి కానీ మాట్లాడలేదు. అంతేకాదు ఎన్నికల్లో మీ గురించి నేనెక్కడా వ్యక్తిగతంగా కూడా మాట్లాడలేదు. ఈ ఎన్నికల ప్రచారం లో నేను వ్యక్తిగత గురించి మీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. గన్నవరం రావడానికి ముందు మీరు నన్ను ఎప్పుడూ చూశారా? మీరు గన్నవరంకు రావడానికి ముందు నాతో మాట్లాడారా? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా నాకు ఫండ్స్ ఇచ్చారా?" అని వల్లభనేని ప్రశ్నల వర్షం కురిపించారు.
కలుసుకోవాలనుకున్నా అంతే..
"సత్సంబంధాలను కొనసాగించేందుకే మీ ఇంటికి వస్తానని నేను ఫోన్ చేశా. మీ అపాయింట్మెంట్ కోసమే ఫోన్ చేశా...మా అనుచరులను మీ ఇంటికి పంపా. నేను మీ ఇంటికి రావడం ఇబ్బంది అయితే మీరే మా ఇంటికి రండి.
మీరు సమయం, తేదీ చెబితే నేను సిద్ధంగా ఉంటా. ఓ కప్పు కాఫీతాగి వెళ్లవచ్చు...మీ అనుచరులను కూడా తీసుకు రండి. మా అనుచరులను మీ ఇంటికి పంపిస్తే నేను బెదిరిస్తున్నానని మీరు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసినట్టు పత్రికల్లో చూసి ఆశ్చర్యపోయాను. మీరు నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల ముందు మీరు ఎవరో తెలియదు.. కొడాలి నాని ద్వారానే పరిచయం. మీరు నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడున్నాడు అన్నీ ఆయనకు తెలుసు.. అందరికీ దేవుడే న్యాయం చేస్తాడు" అని వల్లభనేని వంశీ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ వివాదంపై పోలీసులు, ముఖ్యంగా యార్లగడ్డ, వైసీపీ నేతలు ఎలా రియాక్టవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com