తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ ఎన్నిక
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ కుమార్ విజయం సాధించారు. ఫిలిం ఫెడరేషన్లో మొత్తం 72 ఓట్లు ఉండగా.. వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్‌కు 42, కొమర వెంకటేష్‌కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ గెలుపొందారు. కోశాధికారిగా పోటీ చేసిన రాజేశ్వర్ రెడ్డికి కూడా 42 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రధాన కార్యదర్శిగా పీఎస్ ఎన్ దొర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు.
ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. దర్శకరత్న దాసరి ఫిలిం ఫెడరేషన్‌ను ఏ ఆశయాలతో కొనసాగించారో, అవే ఆశయాలతో తాము సినీ కార్మిక వర్గాన్ని సంక్షేమ బాటలో తీసుకెళ్తామన్నారు. సినీ కార్మికుల ఐక్యత కోసమే తామంతా పోరాడి గెలిచామన్నారు. కరోనా వల్ల చిత్ర పరిశ్రమలో కార్మికుల జీవితాలు అతలాకుతలం అయ్యాయని... వారిని ఆదుకోవడంపై మొట్టమొదటగా దృష్టి పెడతామని అనిల్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోని పెద్దల్ని అలాగే ఛాంబర్, నిర్మాతల మండలి సహకారంతో ఈ కష్టకాలంలో కార్మికులను బతికించుకుంటామని తెలిపారు.
కార్మికుల వేతనాలు విషయంలో చర్చలు సాగిస్తామన్నారు. కార్మికులు ఐక్యతగా ఉంటే పరిశ్రమ బాగుంటుందన్నారు. తమ గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ వల్లభనేని అనిల్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. ఇవాళ కార్మికులు వాళ్ల కోసం పనిచేసే, వాళ్ల కోసం ఆలోచించే టీమ్‌ను ఎన్నుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా సినీ కార్మిక సంఘాలకు పేరు తెచ్చిన వారు ఈ ఎన్నికల్లో గెలవడం శుభపరిణామమని అన్నారు. నూతన అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout