బన్నీ ఫాన్స్ కి వాలెంటైన్స్ డే కానుక

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

ప్రేమికుల దినోత్స‌వం కానుక‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం తన అభిమానుల కోసం గిఫ్ట్ ఇవ్వనున్నాడు. అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య చిత్రంలోని రెండో పాట లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికుల దినోత్సవ కానుకగా రేపు ఉద‌యం 8.30 నిమిషాల‌కి విడుద‌ల చేస్తున్నారు.

ఈ మధ్యే రిలీజ్ చేసిన సైనిక పాటతో తనలోని దేశభక్తిని చాటుకున్న అల్లు అర్జున్... ఇప్పుడు లవర్ ఆల్సో అంటూ ప్రేమను పంచబోతున్నారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్య మందించారు. విశాల్ శేఖర్ సంగీతమందించారు. శేఖర్ ఈ పాటను పాడారు. మొదటి పాటగా రిలీజ్ చేసిన సైనిక పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.... రెండో పాటగా రిలీజ్ కానున్న లవర్ ఆల్సో... ఫైటర్ ఆల్సో అనే పాట కూడా అంతే ఆదరణ పొందుతుంది.

ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఈచిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ... గ్రాండియర్ గా "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సారి ప్రేమికుల దినోత్సవం అన‌గా రేపు అల్లు అర్జున్ అభిమానులకు ప్రత్యేకంగా ఉండనుంది.

ఈ చిత్రంలోని లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాటను ప్రేమికులకు కానుకగా రేపు ఉద‌యం 8.30 నిమిషాల‌కి అందించబోతున్నాం. రామజోగయ్య శాస్త్రి తన అనుభవాన్ని రంగరించి ఈ అందమైన పాటను రచించారు. విశాల్ శేఖర్ అద్భుతమైన ట్యూన్ అందించారు. శేఖర్ గాత్రంతో ఈ పాట మరింత అందంగా తయారైంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి సినిమాను 2018, ఏప్రిల్ 27న విడుదల చేస్తున్నాం. అని అన్నారు.

More News

ఈ వారం కూడా కొనసాగిస్తారా?

తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ లేనంతగా ఈ ఫిబ్రవరి నెలలో ప్రతీ వారం కొత్త దర్శకుల సినిమాలు విడుదల అవుతుండడం విశేషం.

'శివకాశీపురం' ఆడియో లాంచ్!!

సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేశ్ శ్రీ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి హరేశ్వర ప్రొడక్షన్స్ పై

రాజ్ కందుకూరి చేతుల మీదుగా స్పా స్టూడియో ప్రారంభం

ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఈరొజు బంజారా హిల్ల్స్ లొ సావెజ్ అనె ఒక స్పా అండ్ సెలూన్ స్టూడియొని ప్రారంభించారు. ఈ వెడుకలొ ఆయనతొ పాటు ఒక అనాధ శరణాలయం నుంచి బాల బాలికలు కూడా అతిధులుగా పాల్గొన్నారు.

చిత్రీకరణ పూర్తిచేసుకున్న చంద్ర సిద్ధార్థ్ చిత్రం

సందేశాత్మక చిత్రాలతో భిన్నమైన కథలను తెరకెక్కించడంలో ముందు వరుసలో ఉంటారు దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.

ఉగాది నుంచి ఎన్టీఆర్ బ‌యోపిక్‌?

గత ఏడాది కాలంగా అలుపన్నది లేకుండా వరుస సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా గడిపారు నందమూరి నటసింహం బాలకృష్ణ. వరుసగా 'గౌతమిపుత్ర శాతకర్ణి', 'పైసా వసూల్', 'జై సింహా' సినిమా షూటింగ్ లలో పాల్గొని.. నేటి యువ కథానాయకులకు ఛాలెంజ్ విసిరారు బాలయ్య. 'జై సింహా' తర్వాత ఆకట్టుకునే కథలు ఆయన వద్దకు రాకపోవడంతో.. కొంత విశ్రాంతి తీసుకుని నేరుగా ఎన్టీఆర్ బయోపిక్&#