'వ‌కీల్‌సాబ్‌' వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం

  • IndiaGlitz, [Monday,March 30 2020]

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత చేస్తోన్న తొలి చిత్రం ‘వ‌కీల్‌సాబ్‌’. బాలీవుడ్ మూవీ పింక్‌కు ఇది రీమేక్‌. దిల్‌రాజు, బోనీ క‌పూర్ నిర్మాత‌లుగా శ్రీరామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా 80 శాతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. క‌రోనా ఎఫెక్ట్‌తో సినిమా షూటింగ్ ఆగింది. ఈ గ్యాప్‌ను వ‌కీల్‌సాబ్ వేస్ట్ చేయాల‌నుకోవ‌డం లేద‌ట‌. అందుకోస‌మ‌ని వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం చేస్తున్నాడ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్లే.. ‘వ‌కీల్‌సాబ్‌’ కోసం ప‌వ‌న్ డేట్స కేటాయించాడు. అనుకున్న‌ట్లే షూటింగ్ జ‌రిగింది. అయితే జర‌గాల్సిన షూటింగ్ ఆగింది. మ‌ళ్లీ లాక్‌డౌన్ ఎత్తివేయ‌గానే సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈలోపు త‌న పార్ట్‌కు సంబంధించిన డ‌బ్బింగ్‌ను ప‌వ‌న్ ఇంటి నుండి చెప్పేస్తున్నాడ‌ట‌. ఇది పూర్తి కాగానే ప‌వ‌న్ షూటింగ్ త్వ‌ర‌గా పూర్తి చేసేసి త‌దుప‌రి సినిమాకు షిఫ్ట్ అయిపోతాడు ఎందుకంటే అక్క‌డ డైరెక్ట‌ర్ క్రిష్ వెయిటింగ్‌లో ఉన్నాడు. దీన్ని కూడా త్వ‌ర‌త్వ‌ర‌గానే పూర్తి చేయాల్సి ఉంది. దీన్ని పూర్తి చేసిన త‌ర్వాత త‌దుప‌రి క‌మిట్‌మెంట్స్‌పై ఫోక్స్ చేయాల్సి ఉంది.

అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం మే 15న ‘వ‌కీల్‌సాబ్‌’ను రిలీజ్ చేయాల‌నేది నిర్మాత‌లు దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఆలోచ‌న‌గా క‌న‌ప‌డుతుంది. మ‌రి ‘వ‌కీల్‌సాబ్‌’ అనుకున్న‌ట్లు వ‌స్తాడో రాడో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్ప‌దు.

More News

పెళ్లి వాయిదా...పుట్టిన‌రోజు వేడుక‌లు వ‌ద్దు: నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ త‌న పెళ్లిని వాయిదా వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అలాగే ఈ నెల 30న కూడా పుట్టిన‌రోజు వేడుక‌ల‌ను అభిమానులెవ‌రూ నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని కోరుతూ ఓ లేఖ రాశారు.

క‌రోనా నివార‌ణకు అత్యవ‌ర‌స‌మైన ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందించిన నిఖిల్ సిద్ధార్థ‌

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

సినీ కార్మికుల కోసం ముందుకొచ్చిన తారాలోకం

క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) ప్ర‌భావంతో దేశ‌మంత‌టా స్తంభించి పోయింది. ప‌లు రంగాలు ఆగిపోయాయి. అందులో ప‌నిచేసే ప‌లువురు కార్మికుల ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది.

కరోనా లాక్‌డౌన్‌తో మద్యం దొరకలేదని ఆత్మహత్యాయత్నం!

కరోనా నేపథ్యంలో యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నడుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావట్లేదు. మరోవైపు నిత్యావసర సరకులకు సంబంధించిన షాపులు మాత్రం ఉదయం

స్పెయిన్ యువరాణిని బలితీసుకున్న కరోనా

కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా కాటుతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందే కన్నుమూశారు. అయితే తాజాగా కరోనాతో ఇన్నిరోజులు పోరాడిన స్పెయిన్ యువరాణి మారియా థెరీసా