‘వకీల్‌సాబ్’ ట్రైలర్: పవన్ ఎంట్రీయే దుమ్ములేచిపోయింది
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మూడేళ్ల గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కంప్లీట్ చేస్తోంది. బాలీవుడ్ హిట్ మూవీ పింక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ ట్రైలర్ విడుదలైంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు(సోమవారం) విడుదల చేశారు. పవన్ కల్యాణ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర కీలకపాత్రల్లో నటించారు.
ట్రైలర్‌లో ముఖ్యంగా పవన్‌తో పాటు ప్రకాశ్ రాజ్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్లను ప్రముఖంగా చూపించారు. ట్రైలర్ మొత్తం వీళ్ల మధ్య జరిగే కోర్టు సీన్స్‌తో రూపొందింది. ట్రైలర్ ప్రారంభమే కోర్టు సీన్‌తో మొదలైంది. నివేదా థామస్‌ను ప్రకాష్‌రాజ్ కోర్టు బోనులో నిలబెట్టి విచారిస్తున్న సీన్‌తో ప్రారంభమవుతుంది. నివేదా థామస్‌కి జరిగిన అన్యాయం.. తనను ఎలాగైనా కేసు నుంచి బయటకు తీసుకు రావాలని అంజలి, అనన్య పడే తాపత్రయం ఎమోషనల్‌గా ఆకట్టుకున్నాయి. ఇక ప్రకాష్‌రాజ్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత అద్భుతమైన యాక్షన్‌తో ఆయన తన సత్తాను చాటినట్టుగా అనిపిస్తోంది. ఈ ట్రైలర్‌లో పవన్ ఎంట్రీయే దుమ్ము రేపింది. ఇక పవన్ కనిపించే ప్రతీ సీన్ గూస్ బంప్స్ రావడం ఖాయం.
పవన్‌కు, ప్రకాష్‌రాజ్‌కు మధ్య జరిగే కోర్టు సన్నివేశాలు అదిరిపోయాయి. పవన్ రీ ఎంట్రీకి ఈ సినిమా సరిగ్గా సరిపోతుందనడంలో సందేహం లేదు. పవన్ చెప్పే డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. అన్యాయంగా కేసులో బుక్కయిన ఒక అమ్మాయి.. ఎలాగైనా కేసు నుంచి బయట పడాలని ఆ అమ్మాయితో పాటు తనకు సంబంధించిన మరో ఇద్దరు అమ్మాయిలు ప్రయత్నించి విసిగి వేసారిపోయిన టైమ్‌లో పవన్ ఎంట్రీ ఇవ్వడం అద్భుతం. పవన్ ఆ ముగ్గురు అమ్మాయిలకు ఎలా అండగా నిలిచారు? ఎలా బయటకు తీసుకొచ్చారు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లతో ఈ చిత్రం రూపొందిందని ట్రైలర్‌ని బట్టి తెలుస్తోంది. మరోసారి నందా, బద్రీ కాంబినేషన్‌ను తెరపై చూడవచ్చు. ఇక థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్‌కు మరో హైలైట్. సినిమాని ఆయన మ్యూజిక్ ఓ రేంజ్‌కి తీసుకెళ్లబోతోందనేది ఈ ట్రైలర్‌తోనే తెలిసిపోతుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com