ప్రైమ్‌లో ‘వకీల్ సాబ్’.. ముహూర్తం ఫిక్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీ గత శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. మరోవైపు ఓవర్సీస్‌లో ఈ సినిమా తొలిరోజే హాఫ్ మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా డిజటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. అంతే కాదు.. ఇప్పటికే ‘అమెజాన్ ప్రైమ్’ విడుదల తేదీని సైతం ఖరారు చేసింది. కరోనా సమయంలో డిజిటల్ వేదికలపై సినిమాలు చూసే ప్రేక్షకులు బాగా పెరిగారు. దీంతో ఓటీటీ సంస్థలు ఎంతైనా పెట్టి సినిమాలు కొనుగోలు చేస్తున్నాయి.
‘వకీల్ సాబ్’ మూవీ ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకే దక్కించుకుంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దాదాపు రూ. 30 కోట్లకు దక్కించుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ కూడా వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తే రూ. 100 కోట్లు ఇస్తామని అమెజాన్ ప్రైమ్ ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం థియేటర్స్‌లో విడుదలకే మొగ్గు చూపారట. దీంతో రూ.30 కోట్లకు అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను దక్కించుకున్నట్టు తెలుస్తోంది.
తొలిరోజు ‘వకీల్ సాబ్’ రూ.36 కోట్లకు పైగా వసూలు చేసిన విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఈ సినిమాకు ఈ రేంజ్ వసూళ్లు రావడం వెనక పవన్ కల్యాణ్ ఇమేజే కారణమని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన అన్ని సినిమాలను కూడా ప్రైమ్ వీడియోనే డిజిటల్ హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. తాజాగా ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ సినిమా ఏప్రిల్ 23న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులకు సంబంధించిన అన్ని కార్యక్రమాలూ పూర్తైయినట్టు సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments