ఏపీలో ‘వకీల్ సాబ్’ రిలీజ్ వివాదం స్టార్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే టికెట్ ధరలు పెంచాలని.. రిలీజైన రెండు, మూడు వారాల్లోనే పెట్టిన పెట్టుబడి అంతా రాబట్టుకోవాలని నిర్మాతలు, పంపిణీ దారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాకు టికెట్ ధర ఎంత పెంచినా కూడా అభిమానులు మాత్రం వెనుకడుగు వెయ్యరు. తొలి షోనే ఎంత పెట్టైనా సరే కొనాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. దీనిని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ధర పెంచేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే టికెట్ ధరలు పెంచేందుకు సినిమా విడుదలకు అనుమతించేదే లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ వివాదం ప్రారంభైమంది. పొరపాటున టికెట్ ధరలు పెంచారో థియేటర్లపై చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అధికారులు పలు థియేటర్లను సందర్శించి తనిఖీలు సైతం చేపట్టారు. కాగా.. ఇప్పటికే 9,10 తేదీల్లో ప్రీమియర్ షోలు, బెన్ఫిట్ షోలు, రెగ్యులర్ షోలకు ధరలు పెంచి మరీ థియేటర్ల యజమానులు అమ్మేశారు. పవన్‌పై ఉన్న క్రేజ్‌తో ధరలు పెంచినప్పటికీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
ఆన్లైన్లోనే అన్ని టికెట్లు విక్రయించేశామని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు అవకాశం ఇచ్చి.. తమ హీరో సినిమాకు ఎందుకు అనుమతివ్వరని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేట్లు పెంచుకునేందుకు అనుమతివ్వకపోతే.. శుక్రవారం థియేటర్ల ముందు కూర్చుంటామని ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ మానియా తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం ఇప్పటికే ప్రారంభమైంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ సినిమా వస్తుండటంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments