‘వ‌కీల్‌సాబ్’ సంక్రాంతి రేసులో లేన‌ట్టేనా?

  • IndiaGlitz, [Wednesday,November 18 2020]

2020 సినీ అభిమానులకు నిరాశను మిగిల్చిన సంవత్సరమనడంలో సందేహం లేదు. చిత్ర పరిశ్రమ దాదాపు ఆరేడు నెలల పాటు సైలెంట్ అయ్యింది. ఇప్పుడిప్పుడే సినిమాల‌న్నీ కోవిడ్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ సెట్స్‌లోకి వెళుతున్నాయి. ఈ క్ర‌మంలో ‘వ‌కీల్‌సాబ్’ సినిమా కూడా రీస్టార్ట్ అయ్యింది. ఇక సినిమా షూటింగ్ జెట్ స్పీడుతో పూర్తి చేయాల‌ని నిర్మాత‌లు అనుకున్న స‌‌మ‌యంలో ప‌వ‌న్ మాత్రం పొలిటిక‌ల్ వ్య‌వ‌హారాల‌తో బిజీగా ఉన్నాడ‌ట‌. దీని కార‌ణంగా సినిమా షూటింగ్ ఆల‌స్య‌మ‌య్యేలా ఉంది. అంతే కాకుండా కోవిడ్ భ‌యం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదు. ఇలాంటి స‌మ‌యంలో సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయవ‌ద్ద‌ని నిర్మాత‌ల‌కు స‌ల‌హా ఇచ్చిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాత‌లు ‘వ‌కీల్‌సాబ్’ను సంక్రాంతికి కాకుండా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేస్తే బెట‌ర్ అని భావిస్తున్నార‌ట‌. మరి ఈ వార్తలపై నిర్మాతలు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీక‌పూర్‌, దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దీని తర్వాత .. ప‌వ‌న్ మ‌ల‌యాళ రీమేక్ 'అయ్యప్పనుమ్‌ కోశియనుమ్' న‌టిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో పాటు హరీశ్ శంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి సినిమాలు లైన్లో ఉన్నాయి.

More News

ఫిబ్రవరిలో ఏపీ పంచాయతీ ఎన్నికలు.. కొత్త జిల్లాలకు బ్రేక్..

ఏపీ‌లో కరోనా కారణంగా ఆగిపోయిన పంచాయితీ ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతోంది. ఈ ఎన్నికలు  ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం: పవన్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.

క‌మెడియ‌న్‌కి విజ‌య్ సేతుప‌తి స‌పోర్ట్‌

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి మ‌రోసారి త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. సీనియ‌ర్ కోలీవుడ్ క‌మెడియ‌న్‌, ప‌లు చిత్రాల్లో కామెడీతో మెప్పించిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్

పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా.. ‘రియల్ హీరో’

రీల్ పరంగా విలన్.. రియల్‌గా మాత్రం దేశమంతా మెచ్చిన హీరో సోనూసూద్. లాక్‌డౌన్ ప్రారంభమైంది మొదలు..

ఆ ఉద్దేశంతోనే పుట్టినరోజు నాడు ఆలయ మర్యాదలు కోరాం: శారదాపీఠం

‘‘నాగుల చవితి పవిత్ర దినమున, అనగా ఈనెల 18వ తేదీన శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదినోత్సవం నిర్వహిస్తున్నాం.