154 నిమిషాల నిడివితో ‘వకీల్ సాబ్’ రాబోతున్నాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’గా పవన్ కల్యాణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. బాలీవుడ్లో మంచి సక్సెస్ సాధించిన ‘పింక్’ రీమేక్ కావడంతో ఈ సినిమా కూడా తప్పక సక్సెస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అలాగే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్.. ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో పవన్‌కు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమనే టాక్ బాగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాపై సెన్సార్ సభ్యులు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపిసనట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ రిపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 9న థియేటర్లలోకి వచ్చేందుకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
154 నిమిషాల నిడివి గల ఈ సినిమాలో పవన్ ఎంట్రీ, కోర్టు సీన్లు.. సినిమాకి హైలైట్‌గా ఉన్నాయని సెన్సార్ వర్గాలు తెలిపినట్టు టాక్ వినిపిస్తోంది. పింక్, నెర్కొండ పార్వైలోని మెయిన్ కథాంశాన్ని మార్చకుండా.. సరికొత్తగా 'వకీల్ సాబ్'ని వేణు శ్రీరామ్ చిత్రీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక సెన్సార్ నుంచి అయితే ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమాకు తిరుగుండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments