‘వ‌కీల్ సాబ్‌’ బ‌ర్త్ డే ట్రీట్ అదేనా..?

  • IndiaGlitz, [Friday,August 28 2020]

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2. ఆయ‌న అభిమానులు త‌మ బాస్ ప‌వ‌ర్ రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాల్లో మొద‌టగా బాలీవుడ్ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ను ‘వ‌కీల్‌సాబ్‌’గా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్ప‌టికే 80 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఈ సినిమా నుండి ప‌వర్‌స్టార్ ఏదైనా గిఫ్ట్ ఇస్తాడేమోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు .ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 2న ‘వ‌కీల్ సాబ్‌’ మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఇది కాకుండా ప‌వ‌న్ రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అందులో ఒక‌టి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ కాగా.. మరో చిత్రం హ‌రీశ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో చేయాల్సి ఉంది. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ‘వ‌కీల్ సాబ్‌’ షూటింగ్‌ను స్టార్ట్ చేస్తారు. సినిమాను వ‌చ్చే ఏడాది సంక్రాంతి లేదా.. స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు. మ‌రి ప‌రిస్థితులు నిర్మాత‌లు బోనీక‌పూర్‌, దిల్‌రాజుకు అనుకూలంగా మారుతాయేమో చూడాలి. ‘వ‌కీల్ సాబ్‌’పై డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ చాలా ఆశ‌ల‌నే పెట్టుకున్నాడు మ‌రి.

More News

ఆదా శర్మ కొత్త సినిమా 'క్వశ్చన్ మార్క్ (?)'

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో

‘ఆదిపురుష్’ గురించి ప్ర‌భాస్ ప్లాన్‌..!!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో

‘ఆచార్య’ క‌థ రిజిష్ట‌ర్ కాలేదా...!!

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం రీసెంట్‌గా కాపీ రైట్ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది.

రియాకు సుశాంత్ సోదరి స్ట్రాంగ్ కౌంటర్..

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విషయంలో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది.

సినీ ఆర్టిస్టులకు భారీ విరాళం అందజేసిన సూర్య..

కరోనా కాలంలో కష్టాలు ఎందుర్కొంటున్న సినీ ఆర్టిస్టులను ఆదుకునేందుకు హీరో సూర్య ముందుకొచ్చారు.