రంగ రంగ వైభవంగా టీజర్ : మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌కి ‘‘బటర్ ఫ్లై కిస్’’.. ఇచ్చిన కేతికా శర్మ

  • IndiaGlitz, [Monday,January 24 2022]

'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే భారీ విజయం అందుకోవడంతో పాటు నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఆ వెంటనే వచ్చిన 'కొండపొలం' సినిమాకు కలెక్షన్లు రాకపోయినా.. విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

తాజాగా వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. బాపినీడు బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి 'రంగ రంగ వైభవంగా' టైటిల్ ఖరారు చేశారు. ఈ రోజు టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో హీరో వైష్ణవ్ తేజ్ హీరోయిన్ కేతికా శర్మ మధ్య 'బటర్ ఫ్లై కిస్' అంటూ రోమాంటిక్‌గా చూపించారు.

'ఏంటే! ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్' అని హీరో అడిగే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమవుతోంది. ఆ తర్వాత హీరోయిన్ కేతికా శర్మ బదులిస్తూ.. 'అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు తెలుసా?' అని అంటుంది. 'అంటే బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు ఉన్నావ్' అని వైష్ణవ్ తేజ్ అంటాడు. ఆ వెంటనే 'నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా?' అని హీరోయిన్ అడుగుతుండగా.. వారిద్దరి మధ్య ఓ సీతాకోకచిలుక ఎగురుతూ వెళ్తుంది. యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.