నిర్మాతగా మారుతున్న వైష్టో కృష్ణ..
Send us your feedback to audioarticles@vaarta.com
పూరి జగన్నాథ్ నిర్మించిన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేసిన వైష్టో కృష్ణ ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. పూరి దగ్గర చాలా సంవత్సరాలు వర్క్ చేసిన కృష్ణ ఆతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర వర్క్ చేసారు. ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్నిపరీక్షించుకోబోతున్నారు. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వైష్టో కృష్ణ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూవీకి బి.వి.ఎస్ రవి దర్శకత్వం వహించనున్నారు.
పూరి దగ్గర చాలా సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన బి.వి.ఎస్ రవి వాంటెడ్ సినిమాతో దర్శకుడిగా మారాడు. కానీ విజయం మాత్రం సాధించలేకపోయాడు. ఈసారి ఎలాగైనా సరే విజయం సాధించాలని డిఫరెంట్ స్ర్కిప్ట్ రెడీ చేసాడట. కథ బాగా నచ్చడంతో సాయిధరమ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రంలో తేజు సరసన కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఫేం మెహరీన్ నటిస్తుంది. మరో ప్రముఖ హీరోయిన్ కూడా నటిస్తుంది. ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com